
ఆర్ట్సూ సైన్సూ
సైన్సు కెమికల్స్
ఇంకా.. ఆర్ట్సు యాక్ట్సు
ఇలా కొన్ని పదాలు
జీవితాన్ని కదిపి కుదిపేస్తాయి
నిర్వీర్యం అయిన శక్తులను వదిలి
నిస్తేజం నుంచి చేతన వరకూ
చేసిన ప్రయాణంలో వివేకానందుడి స్మరణ
ఈ దేశానికీ భారతీయతకూ ఇవాళ ఎంతో అవసరం

ఇవాళ మా ఊళ్లో మా శ్రీకాకుళం నగరం,సూర్యమహల్ జంక్షన్ లో స్వామీ వివేకానంద విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ వేడుకకు యువ ఎంపీ రామ్మోహన్ అతిథిగా రానున్నారు.వైసీపీ నాయకులు కూడా విచ్చేస్తారు.గౌరవ పార్లమెంటేరియన్ ఎప్పటి నుంచో వివేకానందుని జీవితం గురించి ప్రచారం చేస్తూనే ఉన్నారు..ఆయన జీవితం నుంచి నేర్చుకోదగ్గ సందేశం ఏంటన్నది వివరిస్తూనే ఉన్నారు.ఆ క్రమంలో యువ ఎంపీ రామూ ఎప్పటికప్పుడు కాలేజీలకు వెళ్లి యువతను జాగృతం చేస్తున్నారు. చైతన్య శీలక సమాజం కారణంగానే మంచి పనులు జరుగుతాయి అని నమ్మే యువ నాయకుల్లో ఎంపీ రామూ ఒకరు.