కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటు శత్రు దేశాలకు ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉంది. ప్రతి విషయంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ దూసుకుపోతుంది మోడీ సర్కార్.  ఒక రకంగా చెప్పాలంటే చాణిక్యనీతి ని సరిగ్గా ఫాలో అవుతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇప్పుడు చైనా విషయంలో మోదీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అని చెప్పాలి. సరిహద్దులో చైనా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించిన నాటి నుంచి ఇక చైనాకు వరుస షాకులు ఉస్తూనే ఉంది.



 అయితే ఒక రకంగా ప్రత్యక్ష యుద్ధం చేయడం లేదు కానీ చైనా పై భారత్ ఆర్థిక యుద్ధం చేస్తుంది అని చెప్పాలి. ప్రపంచంలో కెల్లా  అతిపెద్ద మార్కెట్ ను కలిగిన భారత్ చైనా కు సంబంధించిన అన్ని వస్తువులను నిషేధించింది. వాటిని భారత్ వేదికగానే  తయారు చేసుకోవడానికి నిర్ణయించింది. ఈ క్రమంలోనే చైనా కు సంబంధించిన మొబైల్స్ దగ్గర్నుంచి యాప్స్ వరకు కూడా అన్నింటిపై నిషేధం విధించింది. ఇలా చైనా నుంచి పూర్తిగా బంధాన్ని తెంచుకునేందుకు క్రమక్రమంగా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుంది భారతప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చైనా మార్కెట్ కు బ్రేకు వేసింది అని అర్థమవుతుంది.



 ఇటీవలి కాలంలో ఎంతోమంది వాడే విగ్గులు చైనాలో తయారవుతూ ఉంటాయి. అయితే అక్కడికి వెంట్రుకలు పంపించేది మాత్రం భారత్ అని చెప్పాలి. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రముఖ ఆలయాల్లో భక్తులు సమర్పించిన  తలనీలాలను చైనాకు ఎగుమతి చేస్తూ ఉంటుంది భారత్. ఈ క్రమంలోనే ఇక వెంట్రుకలతో విగ్గులు తయారు చేసి భారీగా లాభాలు పొందుతూ ఉంటుంది చైనా. ఇక ఇప్పుడు ఈ విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు ఎగుమతి చేయడం కాదు స్వదేశంలోనే విగ్గులు తయారు చేయాలి అంటూ నిర్ణయించింది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరోసారి చైనా కు ఊహించని దెబ్బ కొట్టింది అని అంటున్నారు విశ్లేషకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: