సాధారణంగా అన్ని దేశాలలో కూడా ఎగుమతి దిగుమతులపై ప్రభుత్వం పన్ను విధించడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇలా పన్నులు విధించడంకారణంగా భారీగానే ఆదాయం పొందుతూ ఉంటాయి అన్ని దేశాలు. ఇక ఒక్కో దేశంలో ఒక్కో తరహా పన్ను విధానం అమలులో ఉంటుంది అనే విషయం తెలిసిందే.  అభివృద్ధి చెందిన దేశాల దగ్గర నుంచి చిన్న ఆదేశాల వరకు కూడా ఇలా పన్ను విధించడం అనే ప్రక్రియ కొనసాగుతోంది. కానీ అటు అరబ్ దేశాలలో మాత్రం ఇప్పటి వరకు పన్ను విధించడం అనే కాన్సెప్ట్ లేదు అనే చెప్పాలి.  ఎగుమతులు దిగుమతుల మీదనే కాదు అటు ప్రజలకు ఇచ్చే బ్యాంకు రుణాల పై కూడా ఎలాంటి పన్నులు వడ్డీ లాంటి విధించవు అక్కడి ప్రభుత్వాలు.


 ఎందుకంటే ఇస్లామిక్ చట్టాల ప్రకారం వడ్డీ పన్నులు వసూలు చేయడం నేరమని అక్కడి ప్రభుత్వాలు భావిస్తూ ఉంటాయ్. ఎన్నో దశాబ్దాల నుంచి సౌదీ అరేబియా సహా అన్ని అరబ్ దేశాల్లో కూడా ఇలాంటి చట్టాలే  కొనసాగుతు వచ్చాయి. ఇప్పుడు అరబ్ దేశాలన్నీ కూడా తమ తీరు మార్చుకుంటున్నాయి. మొన్నటి వరకు ఆయిల్ ద్వారా వచ్చిన లక్షల కోట్ల సంపాదనతో అరబ్ దేశాలు ముందుకు సాగాయ్. కానీ ఇప్పుడు మాత్రం ప్రపంచం మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్ వైపు వెళ్తూ ఉండడం.. ఆయిల్ సమాజం కావాలని కోరుకుంటూ ఉండడం.. ముడి చమురు వినియోగం కూడా తగ్గిపోతుండటంతో తమతమ దేశాల్లో ప్రత్యామ్నాయ ఆదాయాల పై దృష్టి పెడుతున్నాయి అరబ్ దేశాలు.


ఈ క్రమంలోనే తమ చట్టాలలో అనూహ్యమైన మార్పులు తీసుకు వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. దశాబ్దాల నుంచి మహిళలపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసాయ్. అంతేకాకుండా టూరిస్టులను  అనుమతించేందుకు కూడా సిద్ధం అయ్యాయి. ఇక ఇప్పుడు మొదటి సారి అటు పన్ను విధించేందుకు కూడా అరబ్ దేశాలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే జూన్ నుంచి ఏకంగా ఏడు శాతం కార్పొ రేట్ పన్ను విధిస్తున్నాము  అంటూ ప్రకటించింది దుబాయ్. దీంతో మొన్నటి వరకు దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై పన్ను రాయితీలు ఉండేవి. కానీ ఇప్పుడు  నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుపై ఏడు శాతం  కార్పొరేట్ టాక్స్ కట్టాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో మిగతా అరబ్ దేశాలు కూడా ఇలాంటిదే  అమలు చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: