డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం నేరం. ఇప్పటి వరకూ మనకు ఇదే తెలుసు. కానీ పార్లమెంట్ లో సాక్షాత్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనిపై వివరణ ఇచ్చారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం తప్పుకాదని అన్నారు. కానీ దానికి కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయని ఆయన వివరించారు.

బైక్ పై వెళ్తున్నవారు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం ముమ్మాటికీ తప్పే. అదే సమయంలో కారులో వెళ్తూ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడేవారికి మాత్రం కొన్ని మినహాయింపులిచ్చారు. కారులో వెళ్తున్న డ్రైవర్ ఫోన్ చేతిలో పట్టుకుని మాట్లాడితే అది తప్పు. అదే డ్రైవర్ ఫో్న్ తన జేబులోనో లేక ఇంకెక్కడైనా పెట్టి, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడితే మాత్రం అది తప్పుకాదు. అలాంటి సందర్భంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వారికి చలానా విధించలేరు. ఈ విషయాన్నే ఇటీవల లోక్ సభలో వివరించారు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ. అయితే ఇందులో ఉన్న షరతులను కూడా ఆయన సభకు వివరించారు.

అలుసుగా తీసుకుంటారా..?
డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం నేరం కాదు, అదే సమయంలో కొన్ని షరతులు వర్తిస్తాయని చెబుతున్నా.. కొంతమంది పనిగట్టుకుని దీన్ని దుర్వినియోగం చేస్తారనే అనుమానాలు కూడా ఉన్నాయి. డ్రైవింగ్ చేస్తూ ఏ ఉపకరణం ద్వారా ఫోన్ మాట్లాడినా అది డ్రైవర్ కాన్సన్ ట్రేషన్ ని దెబ్బతీస్తుంది. అంటే డ్రైవర్ తన పనిపై దృష్టి పెట్టలేడు. అందుకే డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు అంటారు. మరి మంత్రి చెప్పినదాని ప్రకారం బ్లూటూత్ ద్వారా ఫోన్ మాట్లాడొచ్చు అంటున్నారు. అప్పుడు కూడా డ్రైవర్ కి డ్రైవింగ్ పై కాన్సన్ ట్రేషన్ కుదరదు. ఈ వెసులుబాటు వల్ల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని కొందరు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

ఫోన్ విషయంలో మినహాయింపులొద్దు...
డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోచ్చు, ఫోన్ మాట్లాకూడదు అనే నిబంధనలను సవరించకూడాదని అంటున్నారు నెటిజన్లు. సీట్ బెల్ట్ విషయంలో కేంద్రం స్ట్రిక్ట్ గా ఉన్నా, ఫోన్ విషయంలో ఎందుకు మినహాయింలుపిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే కాన్సన్ ట్రేషన్ దెబ్బతింటుందని అంటున్నారు. మరి కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: