ఏపీలో మంత్రుల పనితీరుపై ప్రజలు పెద్దగా సంతృప్తిగా లేరనే చెప్పొచ్చు...ఎందుకంటే ఈ రెండున్నర ఏళ్లలో మంత్రులు గొప్ప పనితీరు ఏమి కనబర్చలేదు...ఏదో సంతకాలు చేయడానికి తప్ప...స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రులకు అవకాశం దక్కలేదు..పైగా సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగానే మంత్రులు నడిచే పరిస్తితి ఉంది...ఇలాంటి పరిస్తితుల్లో మంత్రులు పెద్దగా తమ మార్కుని చూపించలేకపోయారు. కొంతమంది పర్లేదు గాని...కొంతమంది మరి దారుణమైన పరిస్తితిలో ఉన్నారని చెప్పొచ్చు...అసలు వారు మంత్రులు అనే సంగతి జనాలకే తెలియని పరిస్తితి కూడా ఉంది.

ఆ లిస్ట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కూడా ఉన్నారని చెప్పొచ్చు...ఎందుకంటే ఏదో బాగా రాజకీయాలు తెలిసినవారికి తప్ప...ఈమె మంత్రి అనే సంగతి పెద్దగా ఎవరికి తెలియదు..అలాగే ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడానికి మీడియాలో కూడా ఎక్కువ కనిపించలేదు...దీంతో వనిత పెద్దగా మంత్రిగా హైలైట్ కాలేదు..పైగా తన శాఖకు సంబంధించి చేసిన అద్భుత కార్యక్రమాలు కూడా పెద్దగా లేవు.

ఇలా మంత్రిగా సక్సెస్ కాలేకపోయిన వనిత ఎమ్మెల్యేగా కూడా అంతగా రాణించడం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి..ఈ రెండున్నర ఏళ్లలో కొవ్వూరులో ఈమె చేసిన గొప్ప అభివృద్ధి పనులు పెద్దగా లేవనే చెప్పొచ్చు..దీంతో ఈమెపై కాస్త ప్రజా వ్యతిరేకత పెరిగిందనే చెప్పొచ్చు. ఇలాంటి వ్యతిరేక పరిస్తితుల్లో కూడా వనితకు ఏదైనా ప్లస్ ఉందంటే..అది టీడీపీలో ఉన్న లుకలుకలే.

కొవ్వూరు టీడీపీలో ఆధిపత్య పోరు ఎక్కువ నడుస్తోంది..కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో టీడీపీ దెబ్బతినడానికి ఆధిపత్య పోరు కారణమని చెప్పొచ్చు. ఆ పోరు వల్లే ఇప్పటివరకు కొవ్వూరులో టీడీపీకి ఇంచార్జ్ లేకుండా పోయారు...మాజీ మంత్రి కే‌ఎస్ జవహర్‌కు ఇంచార్జ్ పదవి ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారు..కానీ ఇక్కడ ఉన్న కమ్మ వర్గం మాత్రం జవహర్‌కు ఇంచార్జ్ ఇస్తే ఒప్పుకునే పరిస్తితి కనిపించడం లేదు. ఒకవేళ పదవి ఇస్తే కమ్మ వర్గం సపోర్ట్ చేయకపోవచ్చు. ఈ గ్రూపు తగాదాలే టీడీపీకి మైనస్ అవుతుండగా, మంత్రి తానేటి వనితకు ప్లస్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: