సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా అంశం   కొంత షాక్ కు గురి చేస్తోంది. కానీ ఏఐసిసి, టిపిసిసి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. నేతలు సైతం రోజుకో తీరుగా వ్యవహరిస్తున్నారు.  రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన మరోవైపు అధిష్టానం భావిస్తున్నట్లు అల్టిమేటం జారీ చేశారు. రాజీనామా చేస్తే రేవంత్ వ్యతిరేక వర్గం తనతో కలిసి వస్తుందని, భావించి ఆయనకు నిరాశే ఎదురైనది తెలుస్తున్నది. కాంగ్రెస్ లోనే జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం రచ్చకెక్కింది. రోజుకో తీరుగా వ్యవహరిస్తున్నారు. ఇంతటి నాటకీయ పరిణామాల మధ్య రాజీనామా చేస్తున్నట్టే చెప్పినా ఆయన  అనూహ్యంగా అధిష్టానానికి గడువు రూపంలో అల్టిమేటం జారీ చేశారు. రాజీనామా చేస్తున్నాం అంటూ పలుమార్లు చెప్పుకొచ్చిన ఆయనకు ఏఐసీసీ, టీపీసీసీ నుంచి సరైన రిప్లై రావడం లేదు.

 అసలు జగ్గారెడ్డి అంశాన్ని పట్టించుకోనట్టు టిపి సిసి  వివరిస్తున్నది. జగ్గారెడ్డి వ్యవహారంపై పిసిసి మాజీ అధ్యక్షుడు తన కుమారుడు ఒక అడుగు ముందుకేశారు. ఆయనను ఇంటికి పిలిపించి బుజ్జగించారు. కాంగ్రెస్ గ్రూపులో నేను ఈ క్షణం నుంచి లేనట్టే అంటూ ఏఐసీసీకి లేఖ రాసిన తర్వాత జగ్గారెడ్డి ఇంటికి వెళ్ళడం ఎందుకనే చర్చ  సాగుతున్నది. వీరిద్దరు భేటీపై కాంగ్రెస్ శ్రేణులకు ఒక క్లారిటీ వచ్చినట్లయింది. తరచు తిరుగుబాటుకు దిగుతున్న జగ్గారెడ్డికి ఏఐసిసి నుంచి పిలుపు రావడం లేదని నిర్ధారణ అవుతుంది. అయినా ఢిల్లీ పెద్దలు లైటుగా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తను మాట్లాడి ఇంటికి వెళ్తానని ఉత్తమ్ చెప్పడం చూస్తే ఆయన లైట్ గా తీసుకున్న విషయంపై క్లారిటీ వచ్చినట్లయింది. గతంలో పలుమార్లు సీఎం కేసీఆర్ వెనకేసుకొచ్చిన జగ్గారెడ్డి అంతేస్థాయిలో సొంత పార్టీ నేతలను తప్పు పట్టారు. టిపిసిసి  విషయంలోనూ తీవ్రస్థాయి విమర్శలకు దిగారు. తన ఒక్కడి ఇమేజ్ కోసం  రేవంత్ రెడ్డి మిగతా వారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఇది పార్టీయా లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనినా అంటూ తీవ్ర విమర్శలు చేశాడు. కాంగ్రెస్ లో అందరు ఒకటేనని ఒక్కరే స్టార్ అనుకుంటే కుదరదు అంటూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోవర్టు అనే ముద్రను బాధ కలిగిస్తుందని పార్టీ నుంచి

 వెళ్తున్నాను అంటూ ఆయన శనివారం బహిరంగంగా ప్రకటించారు. ఎఐసిసి పెద్దలు సోనియా రాహుల్ కు లేఖ రాశారు. కానీ తెల్లవారేసరికి మాట మార్చారు. పదిహేను రోజులు వేచి చూస్తామని ప్రకటించారు. అతను రాజీనామా ప్రకటన ఎందుకు మళ్ళి అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయడం ఎందుకని అర్ధం నేతలే ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేస్తున్నట్లు చెప్పిన జగ్గారెడ్డి కి పార్టీ నేతల నుంచి స్పందన రాలేదని స్పష్టం అవుతున్నది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో యాంటీ రేవంత్ వర్గం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: