తెలుగుదేంపార్టీలో సమర్ధులైన నేతలు దొరకటంలేదా ? తాజాగా జరిగిన ఒక డెవలప్మెంట్ చూస్తే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తమ్ముళ్ళతో సమీక్ష జరిపిన చంద్రబాబునాయుడు నాలుగు నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా ఇపుడున్న నేతలనే కంటిన్యు చేయాలని డిసైడ్ అయ్యారు. వీళ్ళ నలుగురిపై స్ధానిక నేతలు బాహాటంగా వ్యతిరేకత వ్యక్తంచేసినా వాళ్ళకి ఏదో సర్దిచెప్పి వాళ్ళని కంటిన్యు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది.





2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో చాలామంది నేతలు స్తబ్దుగా ఉండిపోయారు.  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని స్వయంగా చంద్రబాబు ఇచ్చిన పిలుపును కూడా చాలామంది లెక్కచేయటంలేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కనీసం 70 నియోజకవర్గాల్లో అసలు ఇన్చార్జిలే లేరు. ఇన్చార్జిలున్న నియోజకవర్గాల్లో చాలామంది యాక్టివ్ గా లేరు.





యాక్టివ్ గా లేని ఇన్చార్జిలను మార్చేయాలని, కొత్తవారిని ఇన్చార్జిలుగా నియమించాలని నేతలు డిమాండ్లు చేస్తున్నా చంద్రబాబు పట్టించుకోవటంలేదు. తాజాగా శ్రీకళహస్తి, తాడికొండ, ప్రొద్దుటూరు, పులివెందుల నియోజకవర్గాల నేతలతో సమీక్ష జరిపారు. వీటిల్లో ఇప్పటికే పులివెందుల ఇన్చార్జిగా, అభ్యర్ధిగా బీటెక్ రవిని చంద్రబాబు ప్రకటించారు. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో శ్రీకాళహస్తిలో gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి, తాడికొండలో శ్రవణ్, ప్రొద్దుటూరులో ప్రవీణ్ ఇన్చార్జిలుగా ఉన్నారు.





జరిగిన సమీక్షలో  వీళ్ళ ముగ్గురిని మార్చేసి కొత్త వాళ్ళని నియమించాలని నేతలు డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు మాత్రం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి గట్టిగా పనిచేయాలని చెప్పి తిరిగి ఇన్చార్జిలుగా వాళ్ళనే నియమించారు. మెజారిటి నేతలు వద్దని వ్యతిరేకిస్తున్నా, వాళ్ళు యాక్టివ్ గా లేకపోయినా మళ్ళీ వాళ్ళనే ఎందుకుని కంటిన్యు చేయాలని ఎందుకు అనుకున్నారు ? ఎందుకంటే వీళ్ళని పక్కనపెట్టేస్తే ఇంతకన్నా గట్టి నేతలు లేరట. కాస్తో, కూస్తో నియోజకవర్గంలో తిరుగుతున్నది వీళ్ళేనట. వీళ్ళ స్ధానంలో కొత్తవాళ్ళని పెట్టినా యాక్టివ్ గా తిరుగుతారని గ్యారెంటీ లేదట. అందుకనే వేరే దారిలేక మళ్ళీ వాళ్ళనే కంటిన్యు చేస్తున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: