వైసీపీ అంటే రెడ్డి వర్గానికి ఓ బలమైన వేదిక అని చెప్పొచ్చు..ఆ పార్టీకి బలమైన నిర్మాణం ఉండటానికి రెడ్డి నేతలే కారణమని చెప్పొచ్చు...అంటే వైసీపీని రెడ్డి వర్గాన్ని వేరు చేసి చూడలేమనే చెప్పొచ్చు...రాయలసీమ లాంటి ప్రాంతాల్లో రెడ్డి వర్గం వల్లే వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది...వారే అక్కడ వైసీపీని నిలబెడుతున్నారు...ఏ ఎన్నికలైన సీమలో వైసీపీ సత్తా చాటాడానికి కారణం వైసీపీ నేతలే.

ఇక వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ సత్తా చాటాలంటే రెడ్డి వర్గం నేతల చేతుల్లోనే ఉంది..అయితే కొందరు రెడ్డి నేతలు మళ్ళీ గెలిచి వైసీపీని నిలబెట్టేలా ఉన్నారు...అలా వైసీపీని నిలబెట్టడానికి చూస్తున్న వారిలో చిత్తూరు జిల్లాలో ముగ్గురు రెడ్డి నేతలు ట్రై చేస్తున్నారు...చిత్తూరులో ఇంకా రెడ్డి నేతలు ఉన్నారు కానీ...వారు ఇప్పుడు అంత బలంగా కనిపించడం లేదు. చిత్తూరులో పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్ళపల్లెలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరిలో రోజా, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు.

వీరంతా బలమైన నాయకులే..కానీ నెక్స్ట్ ఎన్నికల్లో వీరు అందరూ సత్తా చాటే అవకాశాలు లేవు...ఇందులో ముగ్గురు నేతలు మాత్రం మళ్ళీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి...అలా గెలవడానికి అవకాశం ఉన్న వారిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు...ఈయనకు పుంగనూరులో చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు..అటు తంబళ్ళపల్లెలో పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డిని ఓడించడం కూడా సాధ్యం కాదని చెప్పొచ్చు.

ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుగులేదు...ఆయనని ఓడించడం టీడీపీ వల్ల కాదు.. అయితే రోజా, చింతల కాస్త డేంజర్ జోన్ లో ఉన్నారు..ఇటు మధుసూదన్, భూమన పరిస్తితి కూడా మరీ బాగోలేదు..వీరికి టీడీపీ రూపంలో ఇబ్బంది ఉంది. మొత్తానికైతే చిత్తూరులో పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డికి తిరుగులేదనే చెప్పొచ్చు..మళ్ళీ వీరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: