ఇక చైనాలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి. కేసులు పెరుగుతున్నా కొద్దీ అక్కడి ప్రభుత్వం వారి ప్రజలపై ఆంక్షలను మరింత పెంచుతోంది.దీంతో అసలు ఏం చేయాలో తెలియక ప్రజలంతా కూడా బాగా ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఓ వైపు కరోనా వైరస్ బాధ కాగా... మరో వైపు ఆకలితో కూడా అలమటిస్తున్నారు. ఏం చేయాలో తెలియక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ మీద లాక్ డౌన్ విధిస్తూ... కఠిన ఆంక్షలని వారు విధిస్తున్నారు.ప్రజలు బయట కనిపిస్తే చాలు ఏదో జంతువుని పట్టుకొని పోయినట్లుగా పట్టుకొని మరీ అక్కడి ఐసోలేషన్ లో వారు పెట్టేస్తున్నారు. అంతేనా కాస్త అనుమానం వచ్చినా కానీ బలవంతంగా కరోనా నిర్ధారణ పరీక్షలని చేస్తున్నారు. దీంతో ప్రజలు లాక్ డౌన్ అన్నా కూడా ప్రభుత్వాధికారులు అన్నా చాలా విపరీతంగా భయపడిపోతున్నారు.



కరోనా పరీక్షలను తప్పించుకునేందుకు ఎన్నెన్నో రకాల ప్లాన్ లు వేస్తున్నారు. అయితే షాంఘై తదితర ప్రాంతాల్లో కరోనా మహమ్మారి లక్షణాలు లేకున్నా కానీ ఐసోలేషన్ కి పంపిస్తున్నారు. అందుకే అక్కడి ప్రజలంతా కూడా షాంఘై నగరాన్ని వదిలి వెళ్లిపోతున్నారు.తాజాగా చైనాలో బలవంతంగా ఓ యువకుడికి కరోనా వైరస్ పరీక్షలు చేశారు. జంతువును లాక్కొచ్చినట్లు అతన్ని లాక్కొచ్చి.. ఒకరు గట్టిగా అతని తల పట్టుకోగా మరొకరు కరోనా నిర్ధారణ పరీక్ష కోసం ముక్కు నుంచి సాంపిల్స్ ని తీసుకున్నారు.ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాసేపట్లోనే ఈ వీడియో కాస్తా బాగా వైరల్ గా మారింది. దీన్ని చూసిన వారంతా కూడా అయితే మరీ ఇంత బలవంతంగా కరోనా పరీక్షలు చేయడం ఏంటంటూ అక్కడ వారిని ప్రశ్నిస్తున్నారు. కొంచెం కూడా జాలి అనేది లేకుండా.. మరీ ఇలా చేయడం అసలు ఏం బాగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: