
గుంటూరు జిల్లాలో తాడికొండ నియోజకవర్గం అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్ర రాజధాని అమరావతికి పరిధిలోనిది కాబట్టి... 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి ఉండవల్లి శ్రీదేవి వైసీపీ నుండి టికెట్ పొంది గెలుపొందారు. అయితే ఈమె రాజకీయాల్లో ఉన్నప్పటికీ వృత్తి పరంగా వైద్యురాలు అన్న సంగతి తెలిసిందే. ఒక ఎమ్మెల్యే అన్న సంగతి కూడా పక్కన పెట్టి ఈమె ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటూ వచ్చారు అన్న అపవాదు ఉంది. ఇది కాకుండా ఈమె మంత్రిగా ఉన్నప్పుడు తన అనుచరులు తాడికొండలో పేకాట శిబిరాలు నిర్వహించిందన్న విమర్శలు సైతం ఎదుర్కొంది. మొత్తానికి నియోజకవర్గంలోని ప్రజలతో టచ్ లో ఉండడం చాలా తక్కువ అని హై కమాండ్ వరకు వెళ్ళింది. పైగా మండల స్థాయి నేతలతో సరైన సమన్వయము కూడా లేదన్నది కాదనలేని వాస్తవం.
ఇక ప్రస్తుతం బాపట్ల ఎంపీగా కొనసాగుతున్న నందిగం సురేష్ కూడా తాడికొండ నియోజకవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. అందుకే ఈ సారి నందిగం సురేష్ ఇక్కడ నుండి ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తున్నారట. ఇద్దరితో పోల్చుకుంటే శ్రీదేవి కన్నా నందిగం సురేష్ వైపే జగన్ మొగ్గు చూపే అవకాశం ఉందన్నది రాజకీయ ప్రముఖులు అభిప్రాయం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి కి ఎమ్మెల్యే టికెట్ దక్కడం దాదాపు అసాధ్యమే అన్నట్లు తెలుస్తోంది. కానీ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నది తెలియాల్సి ఉంది.