జాతీయపార్టీగా మారిన బీఆర్ఎస్ ను కేంద్ర దర్యాప్తుసంస్ధ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెంటాడుతున్నట్లే ఉంది. ఈనెల 19వ తేదీన విచారణకు రావాలని తాండూరు ఎంఎల్ఏ రోహిత్ రెడ్డికి నోటీసులివ్వటంతోనే ఈ విషయం బయటపడింది. ఇంతకీ విచారణకు ఎందుకు రమ్మన్నదంటే బెంగుళూరులో దొరికిన డ్రగ్స్ రాకెట్ లో రోహిత్ కీలకపాత్ర పోషించినట్లు బయటపడిందట. పోయిన ఏడాది బెంగుళూరులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ విషయాన్ని విచారించిన పోలీసులు ఒక నైజీరియన్ను అరెస్టుచేశారు.





అతని అరెస్టుతో విషయం చాలా లోతుల్లో ఉందని అర్ధమై కేసును సీబీఐకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీబీఐ మరింత లోతుగా విచారణ చేసినపుడు కోట్లాదిరూపాయలు చేతులు మారిన విషయం బయటపడింది. దాంతో కేసును ఈడీకి బదిలీచేసింది. దాంతో అప్పటినుండి కేసును ఈడీనే దర్యాప్తుచేస్తోంది. ఈ దర్యాప్తులోనే నైజీరియన్ విచారణలో ముగ్గురు ఎంఎల్ఏలతో పాటు అనేకమంది సినీ సెలబ్రిటీల పేర్లు బయటపడ్డాయి. ముగ్గురు ఎంఎల్ఏల్లో తెలంగాణా బీఆర్ఎస్ ఎంఎల్ఏ రోహిత్ రెడ్డి కూడా ఒకరు.





ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఈమధ్యనే ముగ్గురు  బీఆర్ఎస్ ఎంఎల్ఏల కొనుగోలుకు బీజేపీ తరపున ప్రయత్నాలు జరిగిన విషయం బయటపడింది. అందులో కూడా ఇదే రోహిత్ రెడ్డి ఉన్నారు. దీంతో ఈ కేసును  సిట్ విచారిస్తోంది. ఎంఎల్ఏల కొనుగోళ్ళను అడ్డుపెట్టుకుని బీజేపీ పెద్దలను బయటకు లాగాలని కేసీయార్ ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో రోహిత్ రెడ్డిని గబ్బుపట్టించాలని బీజేపీ కూడా ప్రయత్నిస్తున్నట్లుంది.





అందుకనే  రోహిత్ రెడ్డిని డ్రగ్స్ కేసులో విచారణకు రావాలని ఈడీ నోటీసులిచ్చింది. మొత్తానికి డ్రగ్స్ కేసులో రోహిత్ తగులుకోవటం గ్యారెంటీ అనే అనిపిస్తోంది. బీజేపీ పెద్దలను కేసీయార్ ఏమీ చేయలేకపోయినా రోహిత్ ను మాత్రం ఈడీ అరెస్టుచేయగలదనటంలో సందేహంలేదు. మరీ కౌంటర్, ఎన్ కౌంటర్ స్ట్రాటజీలు ఎంతదాకా వెళతాయో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఏదేమైనా రోహిత్ కు మాత్రం బ్యాడ్ టైమ్ స్టార్టయినట్లే ఉంది. మరీ ఈడీ విచారణ నుండి, కేసుల నుండి రోహిత్ ఎప్పుడు బయటపడతారనే విషయం ఆసక్తిగా మారింది.








మరింత సమాచారం తెలుసుకోండి: