ఇంకా పాదయాత్ర మొదలుకాకుండానే అప్పుడే వార్నింగుల రూపంలో డేంజర్ బెల్స్ మొగుతున్నాయి. ఎంకిపెళ్ళి  సుబ్బిచావుకొచ్చిందనే సామెతలాగ తయారైంది వ్యవహారం. నోటిదురదకొద్దీ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇపుడు అల్లుడు నారా లోకేష్ పాదయాత్రకు చేటు తెచ్చేట్లుంది.  ఇంతకీ విషయం ఏమిటంటే సినిమా ఫంక్షన్లో బాలయ్య మాట్లాడుతు ఆ రంగారావు..ఈ రంగారావు, అక్కినేని..తొక్కినేని అంటు నోటికొచ్చింది మాట్లాడేశారు. దాంతో ఇటు అక్కినేని వారసులకు అటు కాపులకు బాలయ్యపై బాగా మండిపోయింది.

తన తండ్రి ఎన్టీయార్ చాలా గొప్పోడని ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎవరికీ ఇబ్బందిలేదు. అయితే ఎన్టీయార్ ను గొప్పోడని చెప్పటానికి ఎస్వీఆర్, అక్కినేనిని చులకన చేయాల్సిన అవసరంలేదు. ఎస్వీఆర్ ను అభిమానించని తెలుగుప్రజలుండరు. ఇదే సమయంలో ఎస్వీ రాంగారావంటే కాపుల్లో చాలా గొప్ప ఆరాధనా భావముంది. యావత్ ప్రపంచం మెచ్చిన ఎస్వీఆర్ ను బాలయ్య చాలా చులకనగా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. నోటికొచ్చింది మాట్లాడేసి ఎదుటివాళ్ళని చులకనగా మాట్లాడటం ఇదే మొదటిసారికాదు.

గతంలో కూడా రాజకీయాల్లోకి వచ్చి అమితాబచ్చన్ ఏమి పీకాడు ? రాజకీయాల్లో చిరంజీవి ఫెయిర్యూర్ ను ఎద్దేవా చేశారు. మాట్లాడితే తమ బ్లడ్డువేరు. తమ బ్రీడు వేరంటు పదేపదే చెబుతు ఎదుటివాళ్ళని పలుచనగా మాట్లాడటం బాలయ్యకు బాగా అలవాటే. ఈ నోటిదురుసే రేపు లోకేష్ పాదయాత్రను కంపు చేయబోతోంది.

బాలయ్య మాటలకు మండిపోయిన కాపుసంఘాలు అల్టిమేటమ్ ఇచ్చాయి. 25వ తేదీలోగా క్షమాపణలు చెప్పాలని చేసిన డిమాండును బాలయ్య అసలు పట్టించుకోనేలేదు. పదేళ్ళపాటు బాలకృష్ణను పార్టీనుండి బహిష్కరించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఇదికూడా లాభంలేదని అనుకుని 27వ తేదీన కుప్పంలో మొదలయ్యే పాదయాత్రను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చాయి. దీంతో మామ నోటిదూల అల్లుడి పాదయాత్రకు చేటు తెచ్చేట్లుందనే చర్చ మొదలైపోయింది. ఒకవేళ కాపులు లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటే అప్పుడు చంద్రబాబు, బాలయ్య ఏమిచేస్తారు ? దీన్ని కూడా ప్రభుత్వ కుట్రని, పోలీసుల అసమర్ధతని బురదచల్లేస్తు ఎల్లోమీడియాతో వార్తలు, కథనాలు రాయించుకుంటారా ?


మరింత సమాచారం తెలుసుకోండి: