
దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఉచితంగా రేషన్ బియ్యం 85 కోట్ల మందికి అందిస్తున్నారంటే మామూల విషయం కాదని చెబుతున్నారు. అయితే పాకిస్థాన్ లో ఇతర మతాలపై దాడులు, హత్యలు జరిగాయి. కేవలం అక్కడ ఇప్పుడు 9 శాతం కంటే తక్కువ మంది సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లు జీవిస్తున్నారు. అది కూడా ఖైబర్ పంక్తువా, గిల్టిస్తాన్ లాంటి ప్రాంతాల్లోనే వారు ఉన్నారు. మిగతా చోట్ల మొత్తం ముస్లింలే జీవిస్తున్నారు.
కానీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్ లో ముస్లింల సంఖ్య చాలా పెరిగింది. ఇండియాలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నాయి. ఇండియాలో మైనార్టీల సంఖ్య పెరిగితే... పాకిస్థాన్ లో మైనార్టీ ల సంఖ్య తగ్గిందని వారు పోస్టులు పెడుతున్నారు. నూతన పార్లమెంట్ లో సర్వమత ప్రార్థన జరిపి మోదీ ఐక్యతను చాటారని, అదే పాకిస్థాన్ లో ఇలా వేరే మతాల ప్రార్థనలు ఎప్పుడైనా జరిపారా అంటూ నెటిజన్లు ఆ దేశ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అక్కడి ప్రజల్లో మార్పు వచ్చిందన్న విషయం దీనితో అర్థమవుతుంది. పెద్ద దేశంలో అన్ని మతాలకు ప్రాధాన్యం ఇస్తూ.. గొప్పగా ఎదుగుతోంది భారత్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.