ప్రస్తుతం కుంటుపడిన భారత ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే అలాగే వృద్ధి రేటును 5 నుండి 6 శాతానికి పెంచాలంటే దాదాపుగా ఒక అయిదు సంవత్సరాల కాలం పడుతుందని భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు అంటున్నారు. ఇది సాధ్యమవ్వాలంటే అత్యంత కట్టుదిట్టంగా కొన్ని విధానాలు అవలంబిస్తేనే వీలవుతుంది అని పేర్కొన్నారు.