మహా కూటమిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు పూర్తయినట్లు సమాచారం. అయితే ఈ ఎన్నికలలో రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది మహాకూటమి. దీనికి ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఎదుర్కొనేందుకు మహాకూటమి గట్టిగానే వ్యూహాలు రచిస్తోంది.