వల్లభనేని వంశీ వైసీపీలోకి రావడంపై మాట్లాడుతూ వైసీపీ నా సొంత పార్టీ అని, గతంలో వంశీ నన్ను చాలా ఇబ్బందిపెట్టాడని, ఇప్పుడు కూడా వంశీ వైసీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని పలు గ్రామాల్లో మా పార్టీ కార్యకర్తలను నా జన్మదిన వేడుకలు జరపవద్దని ఇబ్బంది పెట్టారని తన ఆవేశాన్ని వెళ్లగక్కారు. పార్టీ మార్పు పేరుతో నాటకాలుడుతున్న వంశీతో నేను కలిసి పని చేయటం జరగదని అన్నారు.