కరోనా ఓ సారి వచ్చిందంటే మళ్లీ రావడం చాలా అరుదు. కానీ కొంతమంది వైద్య శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయోగాల తరువాత మళ్ళీ కరోనా రెండోసారి కూడా సోకవచ్చని చెబుతున్నారు. మొదటి సారి కంటే రెండో సారి కరోనా వస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొదటి సారి కరోనా సోకితే హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకోచ్చని.. కానీ రెండో సారి కరోనా వస్తే మాత్రం కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లి ఆక్సిజన్ పెట్టుకోవాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు.