అనారోగ్యంతో జయలలిత హాస్పిటల్ లో ఉన్నప్పుడు. ఆమె మేన కోడలు అంటూ దీప ఆస్పత్రికి వచ్చింది. మొదట ఎవరు నమ్మలేదు కానీ జయలలిత మరణం అనంతరం ఆమెకు ఉన్న భారీ ఆస్తులు ఎవరికి అనే వివాదం చెలరేగింది. జయలలిత మేన అల్లుడు, మేనకోడలు అంటూ దీప, దీపక్ వచ్చారు. కోర్టులో ఎంతగానో పోరాడి చివరికి తమను తాము నిరూపించుకొని. జయలలిత వారసులుగా హక్కులను చేజిక్కించుకున్నారు. జయలలిత బ్రతికున్న సమయంలో వీరిని కనీసం దగ్గరకు కూడా రానివ్వకపోయినా చివరికి తన ఆస్తులు వీరి సొంతమయ్యాయి.