అమెరికా భారత్ తర్వాత అత్యధిక వ్యాప్తి ఇప్పుడు బ్రెజిల్ దేశంలోనే  ఉంది. చైనా దేశంతో బ్రెజిల్ కు సత్సంబంధాలు ఉన్నాయి. చైనా కంపెనీ సినోవిక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ను కొనుగోలు చేసేందుకు బ్రెజిల్ దేశం భారీ ఆర్డర్ ఇచ్చింది. ఏకంగా 4.6 కోట్ల వ్యాక్సిన్ కొనుగోలుకు అన్ని రకాల ప్రణాళికలు రచించింది... కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కానీ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నిరసనలు చేస్తూ ఈ వ్యాక్సిన్ కొనుగోలును అడ్డుకున్నారు. చైనా వ్యాక్సిన్ లు మాకొద్దు బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.