ప్రపంచ కుబేరుల్లో ఒకరైన లక్ష్మీ మిట్టల్‌కు స్వయానా సోదరుడు ప్రమోద్ మిట్టల్ అందరికీ సుపరిచితులే. వ్యాపారంలో ఆరితేరి కోట్లు సంపాదించి లండన్‌కు చెందిన ఈ వ్యాపారవేత్త అప్పుల్లో కూరుకుపోయారు. వేలు కాదు లక్షల కాదు ఏకంగా వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. దాదాపు 24 వేల కోట్ల రూపాయల అప్పున్నట్టు లండన్ హైకోర్టుకు తెలిపారు ప్రమోద్.