ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పుడు జరిగేది ఒక లెక్క లా తయారైంది. ప్రతిపక్షాల జోరు చూస్తుంటే జగన్ కు వచ్చే ఎన్నికల నాటికీ మంచి పోటీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అధికార పార్టీ పై విరుచుకుపడుతున్నారు.. చంద్రబాబు కూడా రేపో మాపో మొదలుపెట్టనున్నాడు.. అయితే ఈ దూకుడు జమిలి ఎన్నికల ఎఫెక్ట్ అంటున్నారు.. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికల జోరు మొదలుకానుంది. ఇక్కడ తిరుపతి లో అతి త్వరలో ఉప ఎన్నికకు రంగంసిద్ధమవుతుంది.