ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సీఐడీ పెట్టిన కేసులను కొట్టివేయాలంటూ కిలారి రాజేష్‌తో పాటూ మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూములు అమ్మిన వారెవరూ ఫిర్యాదులు చేయలేదని, ఇన్సైడర్ ట్రేడింగ్‌పై ఐపీసీ సెక్షన్లు వర్తించవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. భూములు అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. చివరికి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని పేర్కొంటూ కేసులను కొట్టివేసింది