కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉందనే సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడైతే కొడాలి నాని ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి గుడివాడలో రాజకీయం మారిపోయింది. పూర్తిగా నియోజకవర్గం కొడాలికి అనుకూలంగా మారింది. కొడాలి ఎటు ఉంటే ఆ పార్టీ గెలవడం ఖాయమనే విధంగా తయారైంది.