టీడీపీ నేతలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకురావడం లేదు. మంగళ, బుధవారాల్లో నామినేషన్ల ఉపసంహరణ మొదలుకానుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అందుతున్న లబ్ధి చూస్తూ ఇప్పట్లో టీడీపీ నిలదొక్కుకునే చాన్స్ లేదని, పోటీ చేసి ఓటమి చెందడం కన్నా.. తప్పుకోవడమే ఉత్తమమనే నిర్ణయానికి కార్పొరేటర్ అభ్యర్థులు వచ్చినట్టు తెలుస్తోంది.పార్టీ తరఫున నామినేషన్లు వేసిన 30 మంది వరకు ఉపసంహరణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి నామినేషన్లు ఉపసంహరించుకుంటా మని చెబుతున్నారు. వారిని టీడీపీ అగ్రనేతలు బుజ్జగించే పనిలో పడ్డారు. ఓటమి చెందిన ఫరవాలేదు పోటీలో ఉండాలంటూ నచ్చ చెప్తున్నారు.