ఏపీ రాజకీయాలలో జనసేన స్టాండ్ ఏమిటో ఇప్పటికీ చాలా మందికి అర్ధం కావడం లేదు. కొంత కాలం టీడీపీతో పొత్తులో ఉంటుందు. మరి కొంతకాలం బీజేపీతో జతకడుతుంది. జనసేనాని ఎప్పుడు ఏమి ఆలోచిస్తాడో ఎవ్వరికీ అంతుపట్టదు. గతంలో 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో అటు బీజేపీ టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ తరపున ప్రచారాల్లో విరివిగా పాల్గొన్నారు.