ఏపీ ప్రజలు కోరుకున్నదే జరిగింది. సండే జడ్జిమెంట్ డే టీడీపీకి మరపురాని రోజుగా నిలిచిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ అభ్యర్థులు ఘోరంగా పరాజయం పాలయ్యారు. అయితేే ఎన్నికల ముందు వరకు టీడీపీ నాయకులు పట్టణ మరియు నగర పాలక ఎన్నికలపై మంచి నమ్మకంతో ఉన్నారు. టీడీపీ మాజీ మంత్రులు మరియు సీనియర్ నాయకులు సహా గెలుపుపై ధీమాగా ఉన్నారు.