తుని రైతుల విధ్వంసం కేసులో అరెస్టయిన 13 మందిని విడిచిపెట్టాల్సిందేనంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్షకు దిగారు. ఆయన వయస్సు దాదాపు 67 సంవత్సరాలు. ఆయనకు షుగర్, బీపీ కూడా ఉన్నాయి. అంతవయస్సున్న వ్యక్తి నిరహారదీక్షకు దిగడమే ఓ సాహసం. 

కానీ అలాంటింది ఆయన 13 రోజులపాటు ఆహారం లేకుండా ఎలా ఉన్నారు. అంతే కాదు.. మొదటి రెండు రోజులు ఆయన కనీసం మంచినీరు కూడా తీసుకోనంటూ పట్టుబట్టారు. మొదటి నాలుగైదురోజులు వైద్యానికి కూడా సహకరించలేదు. టెస్టులు కూడా చేయించుకోలేదు. కానీ ఇన్నిరోజులు దీక్ష ఎలా చేయగలిగారు.. 


ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. ఇంటివద్ద కూడా శారీరక శ్రమ చేస్తారట. ఆయన తన స్నానాని నీళ్లు కూడా ఆయనే స్వయంగా బావిలోనుంచి తోడుకుని పోసుకుంటారని చెబుతారు. 

అంతే కాదు.. ఆయన గతంలోనూ ఇలాంటి దీక్షలు చేసి ఉన్నారు. ఇలా దీక్షలు చేయడం ఆయనకు కొత్త కాదు. కాకపోతే ఇలా 13 రోజులపాటు దీక్ష చేయడం మాత్రం ఇదే ప్రథమం. ఇక ఆయన ఇన్నిరోజులు దీక్ష చేయడానికి అన్నింటికన్నా ప్రధాన కారణం.. ఆయన పట్టుదల. ఒక నిర్ణయం తీసుకుంటే మిన్నువిరిగి మీదపడినా నిర్ణయం మార్చుకోరని చెబుతారు. ఈ కారణాలతోనే 67 ఏళ్ల వయస్సులోనూ పట్టుదలగా దీక్ష చేయగలిగారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: