ఆలోచన ఎవరు చెప్పారో కాని భలే బాగుంది. కోతుల బారినుండి రైతులను కాపాడేందుకు, కోతులను తరిమికొట్టేందుకు, లేదా వాటన్నింటిని అడవి ప్రాంతంలో విడిచిపెట్టేందుకు కావాల్సిన డబ్బులను సమకూర్చుకోవడానికి టిఆర్ఎస్ నేత హరీష్ రావు శ్రమదానం చేస్తున్నారు. శ్రమదానం ద్వారా డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బులతో ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎండలో కూడా కష్టపడతున్నారు.

మూడు రోజులుగా సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు సమీపంలో గల అల్లిసాగర్ కుంటకు రైతుల సహకారంతో శ్రమదానం చేస్తున్నారు. అల్లిసాగర్ చెరువు మరమ్మత్తు కోసం 5లక్షల రూపాయలు మంజూరీ కాగా ఈ పనిని కాంట్రాక్టర్లకు అప్పగించకుండా రైతుల సహాయంతో శ్రమదానం చేసి వచ్చిన డబ్బులతో కోతుల బెడదను పారదోలడానికి కృషిచేస్తున్నారు. కోతుల బెడదతో పాటు అడవిపందులతో రైతులు వేసిన పంటలు దెబ్బతినడంతో ఆర్ధికంగా నష్టపోతున్నారు. దీంతో పంటలను కోతులు, అడవి పందులనుండి రక్షించడం కోసం శ్రమదానం ద్వారా వచ్చే డబ్బులను కోతులను పట్టి ఇతర అడవి ప్రాంతాల్లో విడిచిపెట్టడం కోసం వినియోగించనున్నారు. కాగా ఏ ఊరిలో కోతుల బెడద ఉందో ఆ గ్రామంలో ఇటువంటి పనులను ప్రజలతో శ్రమదానం చేయించి కోతుల బెడదనుండి రైతులను కాపాడాలనే ముందు చూపుతో ఇటువంటి కార్యక్రమం చేపట్టారు.





మరింత సమాచారం తెలుసుకోండి: