టాలీవుడ్ సినిమా రంగంలో సంభాషణలు భారీగా చెప్పే కథానాయకుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. సినిమాల్లో రచయితలు రాసిన డైలాగులను బట్టీయం పట్టి  అనర్గళంగా ధారాపాతంగా పలుకుతుంటారు ఆయన. ఇలాంటి సందర్భంలో ఏదైనా తప్పు మాట్లాడినా తడబాటు వచ్చినా, మళ్లీ ఇంకో "టేక్" తీసుకోవచ్చు సినిమా కాబట్టి. సరిగ్గా దర్శకుడు తృప్తి చెందేవరకు డైలాగ్ వచ్చే వరకు టేకుల మీద టేకుల కేకులు తినొచ్చు. 
Image result for nandamuri balakrishna at NTR samadhi while suhasini submitting her nomiknation
కానీ ఈ విధంగా ప్రజా వెధికలపై సాధ్యం కాదు. సమర్ధత లేనివాళ్ళు, భాషాపరిఙ్జానం లేనివాళ్లు భారీ డైలాగుల్ని ఎంత బట్టీపట్టి చెప్పినా మైకు పట్టుకుని మీడియా ముందు మాట్లాడేటపుడు, ప్రజా సమూహాల్ని లేదా పదుగురు పాత్రికేయుల ముందు మాట్లాడితే తేడా కొట్టేస్తుంటుంది. 
Image result for sambhramascharyam by balakrishna
ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ  అనేక సార్లు నవ్వుల పాలయ్యాడన్నది ప్రజలకు తెలుసు. కొన్నేళ్ల కిందట ప్రత్యేక హోదా గురించి బాలయ్య మీడియాకు ఇచ్చిన వివరణ తాలూకు వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. ఎప్పుడు మీడియాను కలిసినా తన మాట తడబాటుతో "సోషల్ మీడియాలో ట్రోలింగ్" చేసుకోవడానికి కంటెంట్ ఇచ్చి వెళ్తుంటాడు బాలయ్య.
Image result for balayya at NTR samadhi while submission of nomination by Suhasini
తాజాగా దివంగత నందమూరి హరికృష్ణ తనయ సుహాసినితో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నందమూరి బాలకృష్న పలికిన పలుకులు అక్కడ ఉన్న జనాలకు పెద్ద షాకే ఇచ్చింది. హరికృష్ణ మరణం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందని బాలయ్య అనడం పెద్ద చర్చకే దారి తీసింది. "దిగ్భ్రాంతి" అని వేదనా పూరిత  పదం వాడాల్సిన చోట "సంభ్రమం ఆశ్చర్యం" లాంటి ఆనందం వ్యక్త పరిచే పదం వాడారు. అంతే హరికృష్ణ మరణం ఈయన గారికి ‘సంబరం.. ఆశ్చర్యం’ కలిగించిందా? అని విన్నవాళ్ళకు మాత్రం అసహ్యం కలిగించింది.  

ఈ విషయమై సోషల్ మీడియాలో ఇప్పటికే భారీ ఎత్తున "ట్రోల్" చేసేస్తున్నారు నెట్ జీవులు. తాజాగా దీనిపై ప్రతిపక్ష వైసిపి సీనియర్ నాయుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందిస్తూ, "మీ అన్న హరికృష్ణ గారు చనిపోవడం మీకు సంబరంతో కూడిన ఆశ్చర్యం కలిగించిందా? అవును తండ్రి కి వెన్నుపొడిచి కాటికి పంపిన వాడితో చేతులు కలిపిన చరిత్ర కదా! కుటుంబ సభ్యలు మరణిస్తే ఆనందం కలుగుతుందా? నిజమే మాట్లాడావు బాలయ్యా!” అని ట్విట్టర్లో పంచ్ విసిరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: