ఇండియా.. పాక్ దేశాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది.  అవకాశం ఎప్పుడు దొరుకుతుందా.. ఇండియాపై విరుచుకుపడదామా అని ఎదురుచూస్తోంది.  బోర్డర్ లో ఇప్పటికే దాడులు చేస్తున్నది.  ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే ఇండియా పోస్టులపై దాడులు చేస్తున్నది.  అక్కడితో ఆగకుండా,  కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించేందుకు రెడీ అవుతున్నది పాక్. ఇలా భౌతికంగా దాడులు చేస్తున్న ఇండియాను ఎదుర్కోవడం సాధ్యం కాకపోవడంతో సైబర్ దాడులు చేసేందుకు పాక్ సిద్ధం అవుతున్నది.  


ఇండియాలోని కంప్యూటర్లు, మొబైల్, ఆర్మీ సిబ్బందికి సంబంధించిన వాట్సాప్ లపై దాడులు చేయడానికి సదా రెడీ అవుతున్నది పాక్.  ఇది కొత్తేమి కాదు.  గతంలో కూడా పాక్ ఇండియా కంప్యూటర్ వ్యవస్థపై హ్యాకర్స్ దాడి చేయాలనీ ప్రయత్నించాయి.  కానీ, కుదరలేదు.  ఇప్పుడు మరలా ఆ దారుణానికి పాల్పడేందుకు పావులు కడుపుతున్నది.  హ్యాకర్స్ ద్వారా వాట్సాప్ లోని డేటాను చౌర్యం చేసి విధ్వంసాలు సృష్టించాలని చూస్తోంది పాక్.  


దీంతో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ఆర్మీ సిబ్బందితో పాటు సామాన్య ప్రజలను కూడా హెచ్చరిస్తోంది.  ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆర్మీ అలర్ట్ అయ్యింది.  వాట్సాప్ గ్రూప్ లో వచ్చే అనవసరమైన లింకులను ఓపెన్ చేయకూడదు అని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు.  ఒకవేళ అలాంటి మెసేజ్ లు వస్తుంటే.. అడ్మిన్ ద్వారా ఆ గ్రూప్ లోని వ్యక్తిని బ్లాక్ చేయాలనీ, ఆ గ్రూప్ నుంచి మెసేజ్ ను తొలగించాలని చెప్పింది.  


అంతేకాదు, సిమ్ కార్డును మార్చినపుడు, పాత సిమ్ ను డిస్ట్రాయ్ చేయాలని నిపుణులుచెప్తున్నారు .  లేదంటే ఆ సిమ్ ను క్లోనింగ్ చేసి డేటాను చౌర్యం చేస్తారని అంటున్నారు.  పోర్టబుల్ చేంజ్ చేసినా, సిమ్ కార్డు మార్చినా, వాట్సాప్ గ్రూప్స్ నుంచి బయటకు రావాలని, ఆ తరువాత కావాలంటే మరలా జాయిన్ కావొచ్చని  అంటున్నారు నిపుణులు.   


మరింత సమాచారం తెలుసుకోండి: