ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండిలోని ఒక భవనంలో... భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు చెలరేగిన భవనం  ప్లాస్టిక్ తయారీ భవనం అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన భవనంలో  భారీగా ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసి ఉంచునట్లు  సమాచారం. కాగా ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఫైర్ సిబ్బంది 30 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే అగ్నిప్రమాదంలో 32 చనిపోయినట్లు ఫైర్ సిబ్బంది గుర్తించారు. 

 

 

 అయితే ఈ ప్రమాదం నుంచి 50 మందిని సురక్షితంగా కాపాడ గలిగామని... మరో 22 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు డిప్యూటీ చీఫ్ ఫైర్  అధికారి సునీల్ చౌదరి చెప్పారు. అయితే ఈ భారీ అగ్ని ప్రమాదం లో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ భవనం లో ఎక్కువగా ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసే నిల్వ ఉంచడంతో ప్లాస్టిక్ బ్యాగులకు  మంటలు అంటుకొని భారీగా చెలరేగినట్లు సమాచారం. ఆ ప్లాస్టిక్ కాలిన వాసనకే అనేకమంది ఊపిరాడక చనిపోయినట్లు తెలుస్తోంది. 

 

 

 

 కాగా ఫైర్ సిబ్బంది సురక్షితంగా కాపాడిన 50 మందికి స్వల్ప గాయాలు అయినప్పటికీ ప్రాణాపాయం తప్పింది. 30 ఫైరింజన్లు రంగంలోకి దిగి మరి మంటలను అదుపు చేస్తున్నాయి. అయితే భవనంలో పూర్తిగా ప్లాస్టిక్ బ్యాగులు ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఇక ప్రమాదం జరిగిన సమయంలో ఆ భవనంలో వంద మందికి పైగానే ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఫైర్ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. 30 ఫైర్  ఇంజన్లతో ఫైర్ సిబ్బంది భారీగా ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ వారిని లోక్నాయక్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే   అర్ధరాత్రి ఈ భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: