ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు తీరులో బాగా మార్పు వచ్చింది. ఒక్కసారిగా అధికారం కోల్పోవడంతో చిత్రవిచిత్రాలుగా చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని వెంటనే దించేసి అధికారం లోకి వచ్చేయాలనే విధంగా రాజకీయాలు చేస్తున్నారు. అసలు జగన్ సీఎం అయినది మొదలు...ఆయన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..వస్తూ పనికిమాలిన పోరాటాలు చేస్తున్నారు. అయితే ఈయన పోరాటాలు ప్రజలకు పెద్దగా రీచ్ కాకపోగా, ఇంకా చులకన అవుతున్నారు.

 

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు. పోనీ ఈయన ఏదోకటి మాట్లాడటమే కాకుండా...ఆ పార్టీ ఎమ్మెల్యేల చేత కూడా అలాగే చేయిస్తున్నారు. తాజాగా కూడా అర్ధం పర్ధం లేకుండా మహిళా ఎమ్మెల్యే చేత మద్యం ధరలు పెంపు, బ్రాండ్ల తగ్గింపు పై మాట్లాడించారు. ఇక దీనిపై స్పీకర్ స్పందించి బ్రాండ్ల గురించి మీకెందుకు తల్లి అని మాట్లాడే వరకు వచ్చింది.

 

మాములుగా మహిళా ఎమ్మెల్యేలు చేత మద్యం విచ్చలవిడి అయిపోతుంది. దీనిని వినియోగం తగ్గించండి అని మాట్లాడించాలి. కానీ బాబు మాత్రం...ఆదిరెడ్డి భవాని చేత మద్యం ధరల పెంపు, బ్రాండ్ల తగ్గింపు గురించి మాట్లాడించారు. పైగా గతంలో లిక్కర్ బ్రాండ్స్‌ చాలా ఉండేవని ఇప్పుడు తగ్గిపోయాయని ఆమె  మాట్లాడుతుండగా స్పీకర్‌ తో సహా సభ్యులందరూ నవ్వుకున్నారు. ఆ బ్రాండ్‌ల గురించి నీకెందుకు తల్లి వేరే వాళ్లు మాట్లాడతారు అంటూ స్పీకర్ నవ్వుతూ ఎమ్మెల్యే భవాని కి సలహా ఇచ్చారు

 

ఇక ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక దీనిపై నెటిజన్లు స్పందిస్తూ...బాబుకు బుద్ధి లేదని కామెంట్లు చేస్తున్నారు. ఒక మహిళా ఎమ్మెల్యే చేత ఇలాగేనా మాట్లాడించేది అంటూ మండిపడుతున్నారు. 40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే వ్యక్తి ఇలా చేయించడం ఏంటని చంద్రబాబుని ఏకి పారేస్తున్నారు. మొత్తానికి ఈ విషయంలో మాత్రం బాబుకు ఏ మాత్రం బుద్ధి లేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: