ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ... జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ క్యాంపస్ దగ్గర చట్ట నిబంధలు వ్యతిరేకంగా  హింసాత్మక ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన కాల్పులపై కొన్ని రాష్ట్రాల్లో నిరసనలు చేయపడుతున్నాయి. ఇక కోల్‌కతా, ముంబై, లక్నో, కేరళలోని యూనివర్శిటీలు, విద్యాసంస్థల్లో విద్యార్థులు బాగా ఆందోళనలు మొదలుపెట్టారు. ఇలా కాల్పులు జరగడం వల్ల  60 మంది విద్యార్థులకు గాయాల పాలు అయ్యారు. 

 

ఈ సంఘటనపై  యూనివర్శిటీ వీసీ నజ్మా అఖ్తర్ మాట్లాడుతూ ... ఉన్నతస్థాయి విచారణ నిర్వహించాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సంఘటనపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తుందన్న పోలీసులు... విద్యార్థులు చేసిన హింసాత్మక అల్లర్లలో నాలుగు బస్సులు, 100 ప్రైవేట్ వాహనాలు, 10 పోలీస్ బైకులు ద్వంసం  అయ్యాయి అని తెలియచేయడం జరిగింది. పోలీసుల ప్రవర్తిస్తుంది తీరును నిరసనలు తెలుపుతూ... ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులు ఎగ్జామ్స్ బాయ్‌కాట్ కూడా చేయడం జరిగింది అని తెలిపారు.

 

మరో వైపు తెలంగాణ... హైదరాబాద్‌లోని వేర్వేరు యూనివర్శిటీల విద్యార్థులు తమ క్యాంపస్‌లలో ధర్నాలు కూడా నిర్వహించారు. ఇక పలు యూనివర్శిటీలో  ప్మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు నిరసన కార్యక్రమాల్లో చేపట్టారు.  ఇక పంజాబ్‌... చంఢీగఢ్‌లో పంజాబ్ యూనివర్శిటీ క్యాంపస్ దగ్గర విద్యార్థులు శాంతియుతంగా ధర్నాలు, నిరసనలు చేశారు.

 

ఇక కేరళలో ఐతే సీపీఎం యూత్ విభాగమైన DYFI సభ్యులు రైల్వే ట్రాకులపై ధర్నా చేశారు అంటే నమ్మండి. కొన్ని రైళ్లను కూడా సీపీఎం  నాయకులూ అడ్డుకోవడం జరిగింది. ఇలా ఆందోళనకరంగా ఉండడంతో కేరళ ప్రభుత్వం... పౌరసత్వ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు  చేయడం లేదు అని వెల్లడించింది.ఇక దక్షిణాదిన ఇలా ప్రకటించిన తొలి రాష్ట్రం కేరళయే అని తెలుస్తుంది. దేశం మొత్తం ఇలాగే నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: