గిట్టనివారిని చంపటానికో, హాని చేయటానికో చేసే విద్యను చేతబడి అని అంటారు. వివిధ ప్రాంతాలను బట్టి బ్లాక్ మాజిక్, బాణామతి, చిల్లంగి అని చేతబడిని వేరువేరు పేర్లతో పిలుస్తారు. చేతబడి నిజంగా లేకపోయినా కొందరు ఈ చేతబడి పేరు చెప్పుకొని వ్యాపారం చేస్తున్నారు. ప్రజల మూఢనమ్మకాలను అడ్డుపెట్టుకొని కొందరు చేతబడి పేరుతో వ్యాపారం చేస్తోంటే మరికొన్ని చోట్ల మాత్రం చేతబడి చేస్తున్నారనే నెపంతో అమాయకులను చంపేస్తున్నారు. 
 
ఏపీలోని కాకినాడలో చేతబడి నెపంతో స్థానికులు మహిళపై దాడి చేశారు. స్థానికులు పాపమ్మ అనే మహిళ ఇంటిపై దాడికి దిగారు. పాపమ్మ ఇంట్లో విధ్వంసం సృష్టించారు. విషయం పోలీసులకు తెలియటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పాపమ్మను రక్షించారు. 15 రోజుల క్రితం కోనాడ సత్యనారాయణ అనే వ్యక్తి పాపమ్మ చేతబడి చేయటం వలనే మృతి చెందాడని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. 
 
పాపమ్మ నిన్న ఒక యువతితో పాపమ్మ మాట్లాడిందని ఆ తరువాత ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని స్థానికులు చెబుతున్నారు. యువతి కుటుంబసభ్యులు తాము ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నామని చెబుతున్నారు. పాపమ్మ చేతబడి చేసిందని అందువలనే యువతి ఆత్మహత్యాయత్నం చేసిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు పాపమ్మను వేరే ప్రాంతానికి తరలించారు. పోలీసులు పాపమ్మ ఇంటి చుట్టూ పహారా కాస్తున్నారు. 
 
చేతబడి చేస్తున్నారనే నెపంతో చాలా చోట్ల గ్రామస్థులు అమాయకులను చంపేసిన ఉదంతాలు ఉన్నాయి. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా కొందరు జనాల మూడనమ్మకాల వలన అమాయకులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా అమాయకుల ప్రాణాలు పోకుండా, అమాయకులపై దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గ్రామాలలో ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించాలని అమాయకుల ప్రాణాలు పోకుండా కాపాడాలని కొంతమంది నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 
 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: