కొత్త సంవత్సరం.. కుర్రకారు ఊగిపోయే వేళ.. ఇక ఫ్రెండ్ సర్కిల్ ఉన్న యూత్ ను పట్టుకోవడం ఎవరి తరమూ కాదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే. హ్యాపీన్యూయర్ కాస్తా విషాదాంతం అవుతుంది. జీవితంలో మరచిపోలేని గుణపాఠం నేర్పుతుంది. అందుకే కాస్త లిమిట్ లో జాగ్రత్తలు తీసుకుంటే.. కొత్త ఏడాదిని మనస్ఫూర్తిగా ఆహ్వానించొచ్చు.
కుర్రాళ్లు ఎక్కువగా చేసే పొరపాటు.. అర్థరాత్రి వేళల్లో జోరు స్పీడుగా బైకులు నడపడం.. కార్ కేసులను తలపించేలా దూసుకుపోవడం, అరుపులు కేకలతో రోడ్ల మీద సందడిచేయడం. ఇలా చేయడం ద్వారా ప్రమాదాలు జరగుతాయి. రోడ్లపై వెళ్లేవాళ్లు ఇబ్బందిపడతారు. న్యూసెన్స్ కేసుల్లో ఇరుక్కుంటే అసలుకే మోసం వస్తుంది.
అలాగే మరికొందరు ఫ్రెండ్స్ తో మందు పార్టీలు ఎరేంజ్ చేసుకుంటారు. కొత్త సంవత్సరం చేసుకుంటే చేసుకున్నారు. కానీ కాస్త జాగ్రత్తలు తీసుకోండి. ఫుల్లుగా తాగేసిన తర్వాత బండ్లు నడపకండి. అంతే కాదు.. మందు తాగే ఉద్దేశం ఉంటే.. అ పార్టీలు దూరంగా ఏర్పాటు చేసుకోకండి. ఒకవేళ చేసుకోవాల్సి వస్తే.. అక్కడే ఈ రాత్రికి విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి.
అంతే కానీ ఫుల్లుగా మందుకొట్టి రోడ్లపైకి వచ్చి జనాన్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి. అలాగే ఆడపిల్లలు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రెండ్స్ తో పార్టీలు అంటూ అర్థరాత్రిళ్లు తిరగకపోవడం బెటర్. తిరగాల్సి వస్తే సేఫ్టీ గురించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నారో ఇంట్లో చెప్పే వెళ్లాలి. చెబితే వెళ్లనివ్వరు కదా అని తప్పుడు సమాచారం ఇస్తే,.. మీరు ఇబ్బందుల్లో ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కష్టమవుతుంది.
అలాగే.. కుర్రాళ్లు తమ పార్టీలకు అక్కాచెళ్లెళ్లను తీసుకెళ్లడం అంత మంచిది కాదు. దూర ప్రాంతాల్లో పార్టీలు అస్సలు మంచిది కాదు. తల్లిదండ్రులు కూడా ఎదిగిన పిల్లలు ఎక్కడకు వెళ్తున్నారో తెలుసుకోవడం అవసరం. వారిని ఓ కంట కనిపెట్టి హెచ్చరించడం చాలా అవసరం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి