ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఘన విజయాలను సొంతం చేసుకుంటూ ఉంది. తెలుగుదేశం పార్టీ 2014లో టీఆర్ఎస్ కు కొంత పోటీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనపడింది. 2018 ఎన్నికల్లో టీడీపీ కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటులో విజయం సాధించటంతో తెలంగాణలో తెలుగుదేశం భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. 
 
ఇలాంటి సమయంలో తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడుతోంది. 2019 ఎన్నికలలో ఎవరూ ఊహించని విధంగా నాలుగు పార్లమెంట్ స్థానాలను బీజేపీ పార్టీ దక్కించుకుంది. టీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా బీజేపీ పార్టీ నాలుగు స్థానాలలో గెలవడం షాక్ కాగా నిజామాబాద్ లో బీజేపీ పార్టీ అభ్యర్థి చేతిలో కేసీఆర్ కూతురు కవిత ఓడిపోవడం మరో ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు. నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలవడంలో ఎన్నికల ముందు ఇచ్చిన పసుపు బోర్డు హామీ కీలక పాత్ర పోషించింది. 
 
కానీ కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనప్పటికీ పసుపు బోర్డు అమలు దిశగా చర్యలు తీసుకోకపోవటంతో రైతుల నుండి అసంతృప్తి వ్యక్తమైంది. రైతులు కూడా పసుపు బోర్డు ఏర్పాటు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఆవశ్యకత గురించి కేంద్రానికి వివరించారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ నెల 25వ తేదీన పీయూష్ గోయల్ పసుపు బోర్డు గురించి ప్రకటన చేయనున్నారు. ఈ ప్రకటన ద్వారా బీజేపీ భారీ లాభం చేకూరనుందని అంచనా వేస్తోంది. 
 
మరోవైపు బీజేపీ పార్టీ ఎక్కడైతే తెలంగాణలో అభ్యర్థులను నిలబెట్టిందో అక్కడ భారీ స్థాయిలో ప్రచారం చేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులకు పరోక్షంగా సపోర్ట్ ఇవ్వాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం టీఆర్ఎస్ పార్టీకి షాక్ అనే చెప్పవచ్చు. మరి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తే ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: