యంగ్ హీరో కార్తికేయ నెటిజన్లకు టార్గెట్ అయ్యాడు. ఇందుకు అందాల రాక్షసి లావణ్యనే కారణం. ఈ ఆరెక్స్ 100 హీరో ఓవర్ ఎగ్జైట్ మెంట్ తో ట్రోల్స్ భారిన  పడ్డాడు. 

 

ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ వరుస చిత్రాలు చేస్తున్నాడు కానీ సక్సెస్ లు మాత్రం దక్కడం లేదు. మధ్యలో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా కూడా నటించాడు. అయినా సక్సెస్ మాత్రం కనికరించలేదు. ఇలాంటి టైమ్ లో ఆశపడకుండానే కార్తికాయే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నటించే ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఈ క్రేజీ ఛాన్స్ పై రియాక్ట్ కాకుండా లావణ్య త్రిపాఠీపై రియాక్ట్ కావడమే ఇపుడు కార్తికేయను నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. 

 

గీతా ఆర్ట్స్ 2  బ్యానర్ లో కార్తికేయ హీరోగా చావు కబురు చల్లగా అనే టైటిల్ తో కొత్త సినిమా స్టార్ట్ అయింది. కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన కార్తికేయ ఫస్ట్ లుక్ కు మాస్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న లావణ్య త్రిపాఠిపై కార్తికేయ చేసిన ట్వీట్ ఇపుడు ట్రోల్స్ కు కారణమైంది. 

 

లావణ్య త్రిపాఠితో నటించబోతుండటం సంతోషంగా ఉందంటూ.. అందాల రాక్షసితో ఆమెకు అభిమానిగా మారిపోయానంటూ ట్వీట్ చేశాడు. ఈ యంగ్ హీరో అంతటితో ఆగకుండా ఆమెతో నటిస్తుండటం గొప్ప ్చీవ్ మెంట్  అంటున్నాడు. ఇందుకు లావణ్య సో స్వీట్ థ్యాంక్యూ.. ఈ సినిమాతో నువ్వు కుమ్మేయడం ఖాయం అంటూ రిప్లై కూడా ఇచ్చింది. నెటిజన్లు మాత్రం సమంత, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్స్ తో నటించడం అచీవ్ మెంట్. అంతేకానీ హీరోయిన్ గా సక్సెస్ కాని లావణ్యతో నటించడం గొప్పేంటని కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: