తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రాజకీయంగా బద్ధ శత్రువులైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులు, బయటకు వస్తున్న అవినీతి వ్యవహారాలు ఇవన్నీ చూస్తుంటే కేంద్రం టీడీపీపై టార్గెట్ పెట్టింది అనే విషయం అర్ధం అయిపోతోంది. ముఖ్యంగా ఏపీలో టీడీపీ నాయకులే టార్గెట్ గా జరుగుతున్న దాడులు చూస్తుంటే వీటి వెనుక ఉంది కేంద్ర అధికార పార్టీ బిజెపి అన్న సంగతి అర్ధం అయిపోతోంది. కేంద్ర ఐటీ శాఖ అధికారులు కనుసన్నల్లోనే ఇప్పుడు ఏపీలో టిడిపి నాయకులు ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. దీని వెనుక బీజేపీ హస్తం ఉంది అనే విషయాన్ని స్వయంగా ఏపీ బీజేపీ నాయకులు సోము వీర్రాజు వంటి వారు స్వయంగా చెబుతున్నారు. 


తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయం చెందడంతో ఆలోచనలో పడిన బీజేపీ అధిష్టానం, ఫలితాలు వెలువడిన రోజే  వైసీపీ అధినేత జగన్ ను ఢిల్లీకి పిలిపించుకుని మద్దతు పొందేందుకు ప్రయత్నించారు. జగన్ బీజేపీతో ఉండేందుకు ఈ రెండు పార్టీల మధ్య ఒక రకమైన అండర్ స్టాండింగ్ ఏర్పడింది. రాబోయే నాలుగేళ్ల కాలంలో జరగబోయే పరిణామాలను ముందుగా ఊహించుకుని ఇప్పుడు జగన్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తీసుకువచ్చేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. ఏపీ లో జరుగుతున్న దాడులు విషయానికి వస్తే చంద్రబాబు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో బిజెపికి ముప్పు తెచ్చే వ్యక్తిగా భావిస్తున్న బీజేపీ ఆయనను రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.


 గతంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేస్తూ చంద్రబాబు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. భవిష్యత్తులోనూ ఆ విధంగానే ప్రాంతీయ పార్టీలను ఏకంచేయగల శక్తి చంద్రబాబుకు ఉందని బిజెపి నమ్ముతోంది. అదే జరిగితే రాజకీయంగా బిజెపి ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ముందే గ్రహించిన బీజేపీ అగ్రనేతలు చంద్రబాబు ను కట్టడి చేసేందుకు పావులు కదుపుతున్నారు.బాబు హయాంలో గతం లో అమరావతి పోలవరం విషయంలో అవినీతి జరిగిందని బిజెపి పెద్దలే  స్వయంగా ప్రకటిస్తున్నారు. దీంతో పాటు జగన్ కూడా చంద్రబాబు అన్ని రకాలుగా ఇరికించాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. తాజాగా మోడీని కలిసిన జగన్ ఈ అంశాల గురించే చర్చించినట్లుగా ఢిల్లీ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: