సాధారణంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే పనులు చేస్తుంటారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మంచి దారిలో పెడతారు. కానీ ఆ ఉపాధ్యాయుడే దారి తప్పి పేద యువతులను టార్గెట్ చేసి ఒకరికి తెలీకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ మోసాలకు పాల్పడ్డాడు. మొదటి భార్య బ్రతికుండగానే తన భార్య చనిపోయిందని నమ్మించి నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులను వివాహం చేసుకున్నాడు. ఉపాధ్యాయుడి రెండో భార్య స్పందనలో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
పూర్తి వివరాలలోకి వెళితే కృష్ణా జిల్లాలోని తోట వల్లూరు పంచాయతీ పరిధిలోని సౌత్ వల్లూరుకు చెందిన మహమ్మద్ బాజీ సెకండరీ గ్రేడ్ టీచర్ గా మండల పరిషత్ పాఠశాలలో పని చేస్తున్నాడు. 2011 సంవత్సరంలో మొదటి భార్య చనిపోయిందని మరో యువతి తండ్రిని నమ్మించి యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. ప్రతి ఆదివారం మాత్రమే ఇంటికి వస్తూ ఉన్న మహమ్మద్ బాజీ గత కొన్ని నెలల నుండి ఇంటికి కూడా రావడం మానేశాడు. 
 
ఆ తరువాత బాధితురాలు ఆరా తీయగా మహమ్మద్ బాజీ నాలుగు సంవత్సరాల క్రితమే మరో వివాహం కూడా చేసుకున్నాడని తెలిసింది. బాధితురాలు మూడో వివాహం గురించి నిలదీయగా బాధితురాలిని కొట్టి అక్కడి నుండి మహమ్మద్ బాజీ వెళ్లిపోయాడు. ఆ తరువాత నెలకు ఒకసారి మాత్రమే రెండో భార్య ఇంటికి వచ్చి వెళ్లేవాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేయటంతో గ్రామ పెద్దలు మహమ్మద్ బాజీని హెచ్చరించగా మహమ్మద్ బాజీ రెండో భార్యను జాగ్రత్తగా చూసుకుంటాని, రెండో భార్య పేరు మీద ఆస్తులు రాస్తానని బాధితురాలి కుటుంబసభ్యులను నమ్మించాడు. 
 
తాజాగా 15 ఏళ్ల మైనర్ బాలికను మహమ్మద్ బాజీ వివాహం చేసుకున్నట్టు రెండో భార్యకు తెలియడంతో బాధితురాలు అతనిపై స్పందనలో ఫిర్యాదు చేసింది. బాజీ మొదటి భార్య కూడా బ్రతికే ఉందని అతని నిజస్వరూపం తెలిసి విడాకుల కోసం ఆశ్రయించినట్టు బాధితురాలికి తెలిసింది. ఎస్పీ విజయారావు తెనాలి డీఎస్పీకి వెంటనే కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: