మాములుగా కోతులు పంటపొలాల్లోని కాయలు, పండ్లను చోరీ చేయడం చూస్తుంటాము. కానీ ఇక్క విడ్డూరంగా ఇంట్లో చొరబడి బంగారాన్ని అపహరించాయట. కలికాలం అంటూ కొందరు పెద్దలు అంటున్నారు. అసలు విషయాలు తెలుసుకుంటే కళ్ళు షాక్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని పలు జిల్లాలో కోతులు చేస్తున్న వీరంగం అంతా ఇంతా కాదు..ఊళ్లు, గ్రామాలపై పడి వానరాలు బీభత్సం స‌ృష్టిస్తున్నాయి. ఇళ్లు, పంటపొలాలపై పడి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. 

 

 

 

అయితే, ఆ మార్గంలో వెళ్లే చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు దారిన వెంట వెళ్లే ప్రయాణికులపై దాడి చేసి గాయపరిచిన సంఘటనలు చాలా జరిగాయి. బెడదను తగ్గించేందుకు ప్రభుత్వం కూడా భారీ యాక్షన్ ప్లాన్‌తో అనేక చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కోతి చేష్టలు మాత్రం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ఇంట్లో చొరబడ్డ కోతులు బంగారు నగలతో ఉడాయించాయి.

 


అసలెందుకు ఇలా చేస్తున్నాయి అనే విషయాన్నీ ఎవరు కనిపెట్టలేక పోతున్నారు.జిల్లాలోని రెబ్బెన పట్టణంలో తహసీల్దార్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో సోమవారం మధ్యాహ్నం కోతులు చొరబడ్డాయి. దొంగలు కన్నా కూడా ఎక్కువగా ఇంట్లో అన్నీ నాశనం చేసి కేవలం బంగారాన్ని మాత్రమే చోరీ చేశాయి. అసలెందుకు బంగారాన్ని తీసుకున్నాయి అనేది మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 

 

 

ఇల్లంతా చిందరవందర చేశాయి. వంట గదిలో దూరిన కోతులు …పప్పు డబ్బాలు ఎత్తుకుని పరిగెత్తాయి.. అయితే.. ఆ డబ్బాలో సదరు ఉద్యోగి తల్లికి చెందిన రెండు తులాలు, కూతురుకు చెందిన తులం బంగారం చైన్‌ ఉన్నాయి. స్థానికుల సాయంతో చుట్టుపక్కల గాలించినా డబ్బాలు లభించలేదని భాదితులు వాపోయారు.ఒకప్పుడు తిండిని కొల్లగొట్టే కోతులు ఇప్పుడు ఏకంగా బంగారాన్ని చోరీ చేస్తున్నాయా అనే విషయాలు నోరు వెళ్ళబెట్టుకొనే చేస్తున్నాయి. పూర్తి వివరాలు సీతెలియల్సి ఉన్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: