ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఖరారు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానికి కేటాయించినట్లు ఉమ్మారెడ్డి తెలిపారు.

 

 

ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వాని కోసం ఏకంగా ముకేశ్ అంబానీయే స్వయంగా జగన్ ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ కూడా అంబానీ కోరిక తీర్చేశారు. అయితే తనకు ఆ అవకాశం ఇచ్చిన జగన్ కు ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వాని ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాజ్యసభ సభ్యుడు, ఎపి నుంచి తిరిగి ఎన్నిక కాబోతున్న పరిమల్‌ నత్వాని థ్యాంక్స్ చెప్పారు.

 

 

సోమవారం సాయంత్రం ఆయన వైసీపీ అభ్యర్థుల ప్రకటనపై స్పందించారు. ఏపీ ప్రజలకు ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేస్తాను ’ అని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి సన్నిహితుడుగా పేరొందిన నత్వాని ఏపీకి పరిశ్రమలు రావడంలో సహకరిస్తారని ఆశిస్తున్నారు.

 

 

అయితే నత్వానీ కోసం ఏకంగా అంబానీయే తరలి రావడం ఓ సంచలనమే అని చెప్పాలి. అది కూడా ఓ రాజ్యసభ సీటు కోసం .. మరి ఎందుకు అంబానీ అంత పని చేసారంటే... నత్వానీ అంబానీకి చాలా కావాల్సిన వ్యక్తి అందులోనూ.. ఏపీ నుంచి తప్ప ఆయన వేరే చోట్ల అవకాశాలు చాలా తగ్గిపోయాయి. అందుకే అంబానీయే స్వయంగా వచ్చి జగన్ ను రిక్వెస్ట్ చేశారు. జగన్ కూడా కాదనలేకపోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: