వైయస్ జగన్మోహన్ రెడ్డి... ఏపీ సీఎంగా, వైసీపీ అధినేతగా తెలుగు రాష్ట్రాలలో ఎవరికీ పరిచయం అక్కరలేని పేరు. జగన్ 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఎదురించి మార్చి 11, 2011న కడప జిల్లా ఇడుపులపాయలోని వైయస్సార్ సమాధి దగ్గర పార్టీని ప్రారంభించారు. నేడు వైసీపీ పార్లమెంట్ లో అతి పెద్ద నాలుగో పార్టీగా అవతరించటంలో జగన్ కృషి ఎంతో ఉంది. నాడు జగన్ స్థాపించిన వైసీపీ నేడు మహా వృక్షంగా ఎదిగింది. 
 
వైసీపీ పార్టీ ఆవిర్భవించి నేటికి సరిగ్గా పది సంవత్సరాలు. వైయస్ విజయమ్మ, వైయస్ జగన్ లతో ప్రారంభమైన వైసీపీ నేడు దేశంలోని అతి పెద్ద పార్టీలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. 80 శాతం సీట్లు, 51 శాతం ఓట్లతో వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తొమ్మిది నెలల్లోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని, చారిత్రాత్మక చట్టాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. 
 
ప్రజా సంక్షేమ పాలనే లక్ష్యంగా తొమ్మిది నెలల్లో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఇతర రంగాలకు పెద్దపీట వేశారు. రాష్ట్రంలో అవినీతిని రూపుమాపాలనే ఉద్దేశంతో ఎన్నో సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి చార్మిత్రాత్మక నిర్ణయాలను సీఎం తీసుకున్నారు. గ్రామ వాలంటీర్ల, గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటి వద్దకు చేరేలా చేశారు. 
 
జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సీఎం జగన్ పార్టీ పదో వార్షికోత్సవం సందర్భంగా ట్విట్టర్ లో " మహానేత ఆశయాల స్పూర్తితో పుట్టిన వైసీపీ పార్టీ 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులకు,ఆదరించిన రాష్ట్ర ప్రజలందరికీ వందనాలు. ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా మీ అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా " అని ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: