హీరోలు సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఉంటారు. కాకపోతే.. సినిమా హీరోల్లా.. పొలిటికల్ హీరోలు ఎప్పుడూ ఒకరే ఉండరు. అంతే కాదు.. సినిమా హీరోలంటే.. దాదాపు ఎప్పుడూ హీరోలుగానే ఉంటారు. ఎవరో ఒకరు తప్ప విలన్లుగా మారరు. కానీ రాజకీయాల్లో అలా కాదు. అవసరాన్ని బట్టి ఇక్కడ ఒకసారి హీరోలుగా కనిపించిన వారు.. మరోసారి విలన్లుగా కూడా కనిపిస్తుంటారు.

 

 

ఇక ఈ వారం విషయానికి వస్తే.. అందరికంటే ఏపీలో పెద్ద హీరో నిమ్మగడ్డ రమేశ్ కుమార్..

ఈ నాయకుడి పేరు ఎప్పుడూ వినలేదేంటి అంటారా.. ఆయన నాయకుడు కాదు.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. మరి ఆయన ఎందుకు హీరో అంటారా.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మొత్తం ఆయన చేతులమీదుగే జరుగుతుంది. అందుకే ఆయన ఈ వారం హీరో అయ్యారు.

 

 

ఇక మిగిలిన హీరోల్లో ఎంపీ పరిమళ్ నత్వానీని చెప్పుకోవచ్చు. రిలయన్స్ అధినేత అంబారీ సన్నిహితుడైన నత్వానీ.. వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఛాన్సు దక్కించుకున్నాడు. వైసీపీ నుంచి రాజ్యసభ స్థానాలు నాలుగే వచ్చే అవకాశం ఉన్నా.. పోటీ చాలా ఎక్కువగా ఉన్నా.. ముకేశ్ అంబానీ రికమెండేషన్ తో నత్వానీ ఈ సీటు పట్టేసి హీరో అయ్యారు. అందుకోసం ఏకంగా అంబానీయే జగన్ ఇంటికి వచ్చాడు మరి.

 

 

ఇక మరికొందరు హీరోలు కూడా ఉన్నారు. వారు కడప జిల్లా నేతలు సతీశ్ రెడ్డి, రామసుబ్బారెడ్డి.. ప్రకాశం జిల్లా నేతలు కరణం బలరామ్, కదిరి బాబూ రావు. మరి వీళ్లెందుకు హీరోలయ్యారంటే.. దశాబ్దాల పాటు తెలుగు దేశంలోనే ఉన్న వారు ఇప్పుడు జగన్ సమక్షంలో జగన్ పార్టీలో చేరారు. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అందుకే హీరోలయ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: