ఏపీలో స్థానిక ఎన్నికల వల్ల వేడెక్కిన రాజకీయం.. అనూహ్యంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయం వల్ల మలుపు తిరిగింది. ఏపీలో స్టేట్ ఎన్నికల కమిషన్ తీసుకున్న అనూహ్యమైన నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. ఆరు వారాల పాటు ప్రక్రియను నిలిపేసింది. ఆరు వారాలు అంటే నెలన్నర.. అంటే.. మేలో మళ్లీ ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

 

 

అయితే.. ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై అధికార వైసీపీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ఏకంగా సీఎం జగనే.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తీవ్రపదజాలంతో విమర్శించారు. చంద్రబాబు కులానికే చెందిన నిమ్మగడ్డ చంద్రబాబుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని రాష్ట్రానికి తీవ్రహాని చేస్తున్నారని మండిపడ్డారు. ఇక జగనే అలా అంటే మిగిలిన నాయకులు ఊరుకుంటారా మరి.

 

IHG

 

ఎన్నికల కమిషన్ బాద్యత ఎన్నికల నిర్వహణే కాని ప్రభుత్వ నిర్వహణ కాదని సత్తెనపల్లి వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. తనకు ఉద్యోగం ఇచ్చినందుకు గాను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ రుణం తీర్చుకున్నారని ఆయన విమర్శించారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడడానికి కరోనా వైరస్ కారణం కాదని, కమ్మ కాస్ట్ వైరస్ అని అంబటి రాంబాబు అన్నారు. ఏ అధికారి నుంచి నివేదిక తీసుకుని రమేష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

 

చంద్రబాబు అడిగారనో... పవన్ కళ్యాణ్ అడిగారనో ఎన్నికలు వాయిదా వేస్తారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ నెల ముప్పై ఒకటి లోగా ఎన్నికలు జరిగితే రాష్ట్రానికి ఐదు వేల కోట్లు వచ్చేవని ఆయన అన్నారు. ఎన్నికలు వాయిదా వల్ల పార్టీకి నష్టం లేదని, కానీ ఏపీప్రజలకు నష్టం అని అంబటి రాంబాబు వివరించారు. ఈ కుట్రలో చంద్రబాబుతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి భాగస్వాములని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: