2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటినుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ కేసిఆర్ ల మధ్య మంచి సంబంధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు వీరిద్దరూ కలిసి కట్టుగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇక తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ ప్లాన్ ను తెలంగాణలో అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి జైలు నుండి బయటకు రానివ్వకుండా ఉంచేందుకు ఏపీ సీఎం జగన్ ప్లాన్ ను కేసిఆర్ ఫాలో అవుతున్నట్లు సమాచారం. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ పై రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరా ఎగరవేసిన కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అటు కోర్టు కూడా రేవంత్ రెడ్డికి బెయిల్ నిరాకరించింది. 

 

 

 వాస్తవానికి అయితే రేవంత్ రెడ్డికి బెయిల్ దొరుకుతుంది అని అందరూ భావించారు... కానీ కోర్టు  మాత్రం రేవంత్ రెడ్డికి బెయిల్ నిరాకరించి భారీ షాక్ ఇచ్చింది. అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ కేసులో  జైలుకు వెళ్లినప్పటి ఇప్పుడు వరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరు మద్దతు పలకలేదు. అయితే దీనికి కారణం పిసిసి గొడవ అని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డికి బెయిల్ నిరాకరించిన...  ఇంకొన్ని రోజుల్లో మాత్రం రాక తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికోసం రేవంత్ రెడ్డి జైలు నుండి బయటకు రానీయకుండా బెయిలు మంజూరు కాకుండా ఉండేందుకు... జగన్ బాటలో ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. 

 

 

 దెందులూరు మాజీ ఎమ్మెల్యే అయిన చింతమనేని ప్రభాకర్ ని జగన్ ఎలాగైతే జైలుకు పంపించిన ఆ తర్వాత బయటకు రాకుండా... పాత కేసులన్ని  మరోసారి తెరమీదకు తెచ్చి జైల్లోనే ఉంచారో  ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కూడా కేసీఆర్ అదే ఫార్ములాను ఆచరణలో పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక జగన్ ప్లాన్ వల్ల ఏకంగా చింతమనేని ఏకంగా 66 రోజుల పాటు జైలులోనే గడిపారు. అయితే ఇప్పుడు వరకు రేవంత్ రెడ్డి పై ఏకంగా 63 మూడు కేసులు ఉన్నచో టీవీ9 లెక్క తేల్చిన విషయం తెలిసిందే. వివిధ కారణాలతో రేవంత్ రెడ్డి పై 63 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు అయినప్పటికీ... మరోసారి పాత కేసులు తెరమీదికి తెచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే పిటి  ద్వారా రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చినప్పటికీ మరో కేసులో  కోర్టు  ముందు ప్రవేశ పెట్టి మరోసారి డిమాండ్ తరలించవచ్చు . ఇలా ఒకవేళ రెండు సంవత్సరాల వరకు శిక్ష పడితే రేవంత్ రెడ్డి ఎంపీ పదవిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: