ముందు ఒక భారీ ప్రాజెక్ట్, వెనుక మరో పెద్ద సినిమా… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నిజంగానే “ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి” అనే పరిస్థితిలో చిక్కుకున్నట్టు కనిపిస్తున్నారు. వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్న ప్రభాస్, అదే సమయంలో నిర్మాతలకు మాత్రం డేట్లు, షెడ్యూల్స్ పరంగా తలనొప్పిగా మారుతున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న రెండు ప్రధాన చిత్రాలు — సందీప్దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్ ’, అలాగే హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘ఫౌజీ’. ఈ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్‌పై ఉండటంతో షూటింగ్ షెడ్యూల్స్ క్లాష్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘స్పిరిట్’ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల దాని ప్రభావం నేరుగా ‘ఫౌజీ’పై పడింది. ముందుగా ప్లాన్ చేసిన టైమ్‌లైన్ ప్రకారం షూటింగ్ పూర్తి కాకపోవడంతో డేట్ల సమస్యలు మరింత తీవ్రమయ్యాయి.

ఇప్పటివరకు ‘ఫౌజీ’ సినిమా సుమారు సగం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ, విడుదల తేదీపై మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో అభిమానుల్లో అయోమయం మొదలైంది. ఇదే సమయంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘స్పిరిట్’ సినిమాపై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించడం అభిమానులకు పెద్ద షాక్‌లా మారింది.సాధారణంగా ‘స్పిరిట్’ షూటింగ్ లేట్ గా స్టార్ట్ అవ్వడంతో అంత ముందుగానే రిలీజ్ డేట్ ఇవ్వడం వెనుక కారణాలు ఏమిటన్న చర్చ మొదలైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ పూర్తిగా కొత్త లుక్‌లోకి మారాల్సి ఉంటుంది. అలాగే సందీప్ రెడ్డి వంగా సినిమాల విషయంలో చాలా కఠినమైన కండీషన్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ కారణాల వల్ల ప్రభాస్ ముందుగా తన పూర్తి ఫోకస్‌ను ‘స్పిరిట్’పైనే పెట్టాల్సి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

దీంతో ‘ఫౌజీ’ షూటింగ్ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే నిర్మాతలు మాత్రం ఎలాగైనా ‘ఫౌజీ’ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. షెడ్యూల్స్‌ను రీ-అరేంజ్ చేసి, ప్రభాస్ డేట్లను మేనేజ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోందని సమాచారం.మొత్తానికి ప్రభాస్ సినిమాల విషయంలో ప్రస్తుతం స్పష్టత కంటే గందరగోళమే ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవైపు భారీ అంచనాలతో ‘స్పిరిట్’, మరోవైపు ఆలస్యం అవుతున్న ‘ఫౌజీ’… ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా కుదురుతుందో, అభిమానులకు క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాల్సిందే. అప్పటివరకు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అధికారిక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: