పెళ్లి పేరుతో చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారు.. మ్యారేజ్ బ్యూరో అంటూ మ్యాట్రిమొని పేరుతో అబ్బాయిలను చాలా మంది వాడుకొని మోసం చేశారు.. అందుకే అలాంటి వాటిని నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.. ఇక్కడ అసలు విషయానికొస్తే ..మ్యాట్రిమొనియల్ వెబ్‌సైట్‌ పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ వివాహ వేదికల ద్వారా తమకు సరైన జోడీ దొరుకుతుందని భావిస్తున్న యువతీయువకులు మోసగాళ్లకు బలవుతున్నారు.


 

మీ ప్రొఫైల్ నచ్చింది.. మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యువకుడి నుంచి అందికాడికి దోచేసిన ఓ కిలాడీ లేడీ మోసాలు ఆలస్యంగా వెలుగు చూశాయి..ఈ మేరకు ముంబైలోని ఓ అర్తిస్తుకు మ్యాట్రి మోని పేరుతో ఒక అమ్మాయి పరిచయమయ్యింది అట...తాను యుకే లో ఉంటానని చెప్పడంతో అతను దాన్ని నిజమేనని నమ్మేసాడు.. అలా ఆ కిలాడి లేడీ మాటలకు మోసపోయాడు.. ఆమె తరచూ ఫోన్ చేస్తే మాట్లాడే వాడినని చెప్పుకొచ్చింది..


 

ఇండియా వస్తున్నట్లు విమానం టిక్కెట్లు కూడా పంపించి నమ్మించింది. సడెన్‌గా ఫోన్ చేసి తాను ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యానని.. తన వద్ద లెక్కచెప్పని యూకే కరెన్సీ ఉండడంతో కస్టమ్స్ అధికారులు నిలిపివేశారని చెప్పింది. అందుకు ఫైన్ కట్టాల్సి ఉందని.. మిమ్మల్ని కలిసిన సమయంలో ఆ నగదు అందజేస్తానని చెప్పడంతో ఆ నగదు పంపేందుకు యువకుడు ఒప్పుకున్నాడు...

 

 

అయితే తనకు నగదు రూపంలో  ఇస్తానని చెప్పాడు.. ఒక బ్యాంక్ ఖాతా ఇచ్చి అందులో డబ్బులు వేయమని చెప్పింది అందుకు అతను అంగీకరించి 59 వేల రూపాయలను ఆమె అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశాడు.. కొద్ది గంటల తర్వాత నీ దగ్గరకు వస్తాను అని నమ్మించి మోసం చేసింది.. ఈ మేరకు నాకు ఇంకా కొంచం డబ్బులు కావాలి 2.5లక్షలు అని అడిగింది వెంటనే షాక్ అయిన అతను మోసపోయానని తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు... పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ కిలేడిని అదుపులోకి తీసుకున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: