క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినే ఇదే మాట వినిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తూ వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఇప్ప‌టికే ప్రపంచంలోని 200పైగా దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌.. అగ్రరాజ్యాల నుంచి పసికూనలను సైతం గడగడలాడిస్తోంది. ఇక ఈ క‌రోనా మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. నివార‌ణ‌పైనే దృష్టి సారించారు. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగా పలు దేశాలు లాక్‌డౌన్ విధించి ప్రజలను గడప దాటి రాకుండా చేశాయి. కేవలం నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లే వెసలుబాటును కల్పిస్తున్నాయి. 

 

అయితే కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగానే లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తూ పోలీసుల చేతికి చిక్కుతున్నారు. ఇలాంటి వారి కారణంగా అత్యవసర సేవల నిమిత్తం రోడ్ల మీదకు వచ్చిన ప్రజలపై కూడా పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పోలీసులు, మిలటరీకి ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే సంచలన ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని సహించేది లేదని, వారిని కాల్చి చంపండి అంటూ ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే ఆ దేశ పోలీసులు, మిలటరీ అధికారులను ఆదేశించారు. 

 

అయితే ఫిలీప్పీన్స్ అధ్య‌క్షుడి ఆదేశాలపై మాన‌వ‌హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు, నెటిజ‌న్లు మండిపడుతున్నారు. దీంతో క‌రోనా వైరస్  తీవ్రత దృష్ట్యా నిబంధలు పాటించని వారిపట్ల అయన అలా మాట్లాడార‌ని.. కానీ, ఎవ‌రినీ షూట్ చేయ‌ర‌ని ఫిలిప్పీన్స్ పోలీస్ బాస్ చెప్పుకొచ్చారు. కాగా, ఫిలిప్పీన్స్ దేశంలో 2,311 మందికి కరోనా వైరస్ సోకగా, వారిలో 96 మంది మరణించారు. ప్రతీరోజూ వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో సమస్య తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ అమలు చేయాలని రోడ్రిగో డ్యూటెర్టే కోరారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 
   

మరింత సమాచారం తెలుసుకోండి: