భారత్లో కరోనా  వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంది అనే చెప్పాలి. రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో భారత్లో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు.. శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఎన్నో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ ఎక్కడ ఫలితం మాత్రం లభించడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న ప్రజలను సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తున్న... ప్రజల నిర్లక్ష్యం కారణంగా రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. 

 

 

 ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మత ప్రార్థన భారీ సభ మర్కజ్ సమావేశం ప్రస్తుతం భారత ప్రజలలో భయాందోళనలు నింపిన  విషయం తెలిసిందే. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న చాలా రాష్ట్రాల నుంచి ఎంతో మంది తరలి వెళ్లడంతో పాటు ఇండోనేషియా సహా పలు దేశాల నుంచి కూడా మత బోధకులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన చాలామందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అవుతుంది. ఇప్పటికే ఈ సమావేశంకి  వెళ్లి వచ్చిన వారిలో చాలామందికి కరోనా  వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే కొంత మంది స్వచ్ఛందంగా ఈ సమావేశానికి వెళ్లి వచ్చిన వారు క్వారంటైన్ లోకి వెళ్తుండగా కొంతమంది మాత్రం చికిత్సకు సహకరించడం లేదు. 

 

 

 అయితే ఢిల్లీలో జరిగిన మార్కజ్  సమావేశానికి వెళ్లి వచ్చిన తబ్లిక్  జమాత్ కార్యకర్తల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది అనే చెప్పాలి. కరోనా  వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఢిల్లీ వెళ్లి వచ్చిన ఇద్దరు జమాత్ కార్యకర్తలను ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాశీపూర్ క్వారంటైన్ కి  కేంద్రానికి తరలించారు. అయితే క్వారంటైన్ లో  చికిత్స తీసుకోవాల్సిన ఇద్దరు కార్యకర్తలు చికిత్సకు నిరాకరించి ఆసుపత్రికి కిటికీలు బద్దలుకొట్టి  అక్కడి నుంచి పరారయ్యారు. ఇక అక్కడి నుంచి పారిపోయిన జమాత్ కార్యకర్తల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే 14 రోజులపాటు క్వారంటైన్  లో వుండి వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన జమాత్ కార్యకర్తలు పారిపోవడంతో వైద్య అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: