దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఒకసారి కరోనా భారీన పడిన పడిన వారికి మరలా కరోనా సోకుతుందా...? అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది. వైద్యులు కరోనా సోకిన వారు మరోసారి వైరస్ భారీన పడినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు. కొన్ని పరిశోధనల్లో శరీరంలో ఉండే యాంటీ బాడీలు ఆ ప్రభావాన్ని తగ్గిస్తాయి కానీ కరోనా కచ్చితంగా మరలా సోకదని చెప్పలేమని తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. 
 
కరోనా నుంచి కోలుకున్న 91 మంది దక్షిణ కొరియాలో మళ్లీ కరోనా భారీన పడ్డారు. కరోనా నుంచి కోలుకున్న వారికి ఇతరుల నుంచి వైరస్ సోకి ఉండవచ్చని తాము భావించడం లేదని... వైరస్ శరీరంలోనే తిరిగి చైతన్యవంతం అయి ఉండవచ్చని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. దక్షిణ కొరియాలో 10,480 మంది కరోనా భారీన పడ్డారు. ఇప్పటివరకు వీరిలో 7,200 మంది కోలుకున్నారు. 
 
కొందరు వైద్యులు వైరస్ అవశేషాలు ఉండటం వల్ల కరోనా పాజిటివ్ వచ్చి ఉండవచ్చని వారి నుంచి ఇతరులకు కరోనా సోకే అవకాశం తక్కువని వైద్యులు చెబుతున్నారు. హలామ్ యూనివర్సిటీ సెక్రెడ్ హార్ట్ హాస్పిటల్ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ జుంగ్ కి సుక్ వైరస్ విషయంలో పలు సందేహాలు, అభిప్రాయాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ ను కనిపెట్టడం కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 
 
వైద్యులు కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి యాంటీ బాడీలను సేకరించి కరోనా చికిత్స కోసం వినియోగిస్తున్నారు. వైద్యులు ప్లాస్మా చికిత్సగా పిలవబడే ఈ చికిత్స వైపే మొగ్గు చూపుతున్నారు. పలు దేశాలలో ప్రయోగాత్మకంగా ఈ చికిత్సను చేపట్టారు. కొన్ని దేశాలలో ఈ చికిత్స మంచి ఫలితాలు ఇచ్చింది. మన దేశంలో కూడా పలు రాష్ట్రాలలో ఈ చికిత్సా విధానాన్ని కరోనా రోగులపై ప్రయోగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: